
‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్లో కమల్ హాసన్ చేసిన కన్నడ భాషపై వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కర్ణాటకలో సినిమాపై నిషేధం విధించబడింది. దీంతో కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించారు.
Key Points
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమా ప్రమోషన్లో కన్నడ భాష గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో సినిమాపై నిషేధం విధించబడింది.
కోర్టు కమల్ హాసన్ నుంచి క్షమాపణ కోరింది.
‘థగ్ లైఫ్’ సినిమా వివాదం
కమల్ హాసన్ చేసిన ‘కన్నడ’ కామెంట్స్ వల్ల ‘థగ్ లైఫ్’ సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ మూవీపై నిషేధం విధించారు. దీంతో కమల్.. కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు తన చిత్ర విడుదల విషయమై పిటిషన్ వేశారు. ఇప్పుడు దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కమల్ హాసన్‌కి చివాట్లు పెట్టింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది.
కర్ణాటక హైకోర్టు తీర్పు
కమల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్ట్.. ‘మీరేమైనా చరిత్రకారుడా లేదా భాష పండితుడా? కన్నడ అనేది తమిళ నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు క్షమాపణ చెప్పింది. సమస్య పరిష్కారమవుతుంది’ అని తీర్పు ఇచ్చింది.
వివాదం విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని కమల్ చెప్పారు. దీంతో కర్ణాటకలోని అధికార, విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్.. తమ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో దారిలేక కమల్.. కర్ణాటక హైకోర్ట్‌ని ఆశ్రయించారు. ఇప్పుడు తీర్పు కమల్‌కి వ్యతిరేకంగా వచ్చింది. మరి ఇప్పటికైనా కమల్ సారీ చెబుతారా లేదా అనేది చూడాలి?
కమల్ హాసన్ క్షమాపణ
కర్ణాటక హైకోర్టు తీర్పుతో కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆయన క్షమాపణ చెబుతారో లేదో చూడాలి. ఈ వివాదం సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా అన్నది చూడాలి.


