
📌 Key Points
- కన్నడ నటీమణుల ఆగ్రహం: పాపరాజీల అసభ్యకర వీడియోలపై తీవ్రంగా స్పందించిన ఆషికా రంగనాథ్, సప్తమి గౌడ, రుక్మిణి వసంత్!
- జూమ్ చేసి ప్రైవేట్ పార్ట్స్ వీడియోలు తీయడంపై ఫైర్: ఇది సినిమా కాదు.. మహిళలను గౌరవించండి అంటూ కన్నడ భామల హెచ్చరిక!
- సెలబ్రిటీల ఆగ్రహం: ఈవెంట్స్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అడ్డు తగులుతున్న పాపరాజీల తీరుపై మండిపాటు!
- పాపరాజీల ప్రవర్తన మారాల్సిందే: తక్షణమే మార్పు రావాలని సినీ ప్రముఖుల డిమాండ్.. లేదంటే చర్యలు తప్పవు!
తాజా సంచలనం! పాపరాజీల ప్రవర్తనపై కన్నడ నటీమణులు ఒక్కసారిగా ఫైర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అసభ్యకరమైన వీడియోలు, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాట్లు.. దీనిపై హీరోయిన్స్ ఎలా స్పందించారో చూద్దాం!
పాపరాజీల ఆగడాలు: కన్నడ నటీమణుల సీరియస్ వార్నింగ్!
Paparazzis : ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే వినిపించే పాపరాజీస్, ప్యాప్స్ ఇప్పుడు సౌత్ లో, తెలుగు సినీ పరిశ్రమలో కూడా వినిపిస్తుంది. ఏదైనా సినిమా ఈవెంట్ జరిగినప్పుడు కొంతమంది సోషల్ మీడియా పేజెస్ వాళ్ళు వచ్చే సెలబ్రిటీలను వీడియోలు తీసి వారి పేజెస్ ద్వారా ప్రమోట్ చేస్తారు. అయితే బాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ జనాల్లో ఉండటానికి డబ్బులిచ్చి మరీ ఈ పాపరాజీస్ ని పెట్టుకుంటారు.
ఈ పాపరాజీస్ ఇటీవల హద్దు మీరి సినిమా ఈవెంట్స్ మాత్రమే కాక సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి సందర్భంలో ఉన్నారు, వారు ఎలాంటి బట్టల్లో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని కూడా పట్టించుకోకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది ప్యాప్స్ హీరోయిన్స్ ని జూమ్ చేసి, వారి ప్రైవేట్ భాగాలని వీడియోలు తీసి, అసభ్యకరమైన యాంగిల్స్ లో వాళ్ళని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
జూమ్ వీడియోలతో చిక్కులు: హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలకు భంగం!
కొన్ని రోజుల క్రితం దీనిపై పలువురు హీరోయిన్స్ వ్యతిరేకించగా ఇప్పుడు వరుసగా కన్నడ భామలంతా ప్యాప్స్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్స్ ఆషికా రంగనాథ్, సప్తమి గౌడ, రుక్మిణి వసంత్ లు తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో ప్యాప్స్ పై ఫైర్ అయ్యారు.
కొంతమంది పాపరాజీస్ హీరోయిన్స్ ని అసభ్యకరమైన యాంగిల్స్ లో, క్లోజ్ గా, అక్కర్లేకుండా జూమ్ చేసి వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఒక మహిళగా , సినీ పరిశ్రమలో పనిచేసే వ్యక్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఈ బిహేవియర్ కరెక్ట్ కాదు. మేము ఇక్కడ సినిమా చేయడానికి, మా కళ ని చూపించడానికి మాత్రమే ఉన్నాము. ఇలాంటి వీడియోల్ని మేము ఖండిస్తున్నాము. దీనిపై మేమంతా ఒక్కటిగా నిలబడతాము అంటూ పోస్ట్ చేసారు. దీంతో మరికొంతమంది నటీమణులు ఈ ప్యాప్స్ పై ఇలాంటి పోస్టులే చేస్తున్నారు.
సినీ పరిశ్రమలో దుమారం: పాపరాజీల ప్రవర్తనపై నిరసనలు!
పాపరాజీస్ కూడా ఇకనైనా మారాలి. గతంలో ఆల్రెడీ పలువురు హీరోయిన్స్ వీళ్ళపై అందరి ముందు ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం ఈవెంట్ కి సంబంధించిన విజువల్స్ తీసుకోకుండా కొంతమంది ప్యాప్స్ హీరోయిన్స్ ని అసభ్యకరంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అంతే కాకుండా చాలామంది ప్యాప్స్ ఈవెంట్స్ లో అడ్డంగా ఉంటూ, సెలబ్రిటీల మీద పడిపోతూ వాళ్ళ దారికి అడ్డం వస్తూ ఈవెంట్స్ లో చాలామందికి ఇబ్బంది కలిగిస్తారు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు ఒకేసారి కన్నడ భామలంతా వచ్చారు. వీళ్ళు మారకపోతే మున్ముందు మరింతమంది సెలబ్రిటీలు ప్యాప్స్ పై డైరెక్ట్ గానే ఫైర్ అవ్వాల్సిన పరిస్థితులు రావొచ్చు.
కన్నడ నటీమణులు పాపరాజీల పై తిరగబడ్డారు. దీనితో పాపరాజీల ప్రవర్తన మారుతుందా లేదా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


