
మోస్ట్ అవైటెడ్ కన్నడ సినిమాలు సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీలో విడుదల కానున్నాయి. హారర్, యాక్షన్ థ్రిల్లర్లు, శ్రీలీల సినిమాతో సహా, ఈ సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Key Points
సెప్టెంబర్ మొదటి వారంలో 'సు ఫ్రమ్ సో', 'జూనియర్', 'ఎక్కా' సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి.
'సు ఫ్రమ్ సో' హారర్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
శ్రీలీల నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'జూనియర్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
'ఎక్కా' యాక్షన్ డ్రామా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
సు ఫ్రమ్ సో: హారర్ థ్రిల్లర్ యొక్క ఓటీటీ ప్రయాణం
మోస్ట్ అవైటెడ్ కన్నడ సినిమాల్లో మూడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే ఓటీటీలో అడుగుపెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు చిత్రాలు వచ్చే వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో ఒకటేమో హారర్ థ్రిల్లర్, మరొకటి యాక్షన్ థ్రిల్లర్, ఇంకోటి యాక్షన్ డ్రామా. ఈ మూడు సినిమాలు ఏవి? ఏ ఓటీటీలోకి వస్తున్నాయో చూద్దాం.
కన్నడతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న చిత్రం ‘సు ఫ్రమ్ సో’. ఇదో హారర్ థ్రిల్లర్ . చిన్న సినిమాగా థియేటర్లో అడుగుపెట్టిన సు ఫ్రమ్ సో రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. మౌత్ టాక్ బాగుండటం, కలెక్షన్లు భారీగా రావడంతో మలయాళం, తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమాలో ఓ యువకుడిగా ఆడ దెయ్యం పడితే ఎలా ఉంటుందనేది థ్రిల్లింగ్ గా చూపించారు. డైరెక్టెర్ జేపీ తుమినాడే కీ రోల్ ప్లే చేశాడు. ఇందులో రాజ్ బి శెట్టి కీలక పాత్ర పోషించాడు.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే అంటూ లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 5న ఈ హారర్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్ లోకి వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
జూనియర్: శ్రీలీల యొక్క యాక్షన్ థ్రిల్లర్
మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా పరిచయమైన సినిమా ‘ జూనియర్ ’. ఇందులో కిరీటీతో యంగ్ సెన్సేషన్ శ్రీలీల రొమాన్స్ చేసింది. తన యాక్టింగ్, డ్యాన్స్ లతో ఇరగదీసింది. ఇక జెనీలియా చాలా కాలం తర్వాత ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. కన్నడ, తెలుగు భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.
గ్లామర్ తో రెచ్చిపోయిన శ్రీలీల హీరోయిన్ గా నటించిన జూనియర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ అవుతుందని టాక్.
ఎక్కా: యాక్షన్ డ్రామా యొక్క డిజిటల్ ప్రయాణం
యువ రాజ్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన యాక్షన్ డ్రామా సినిమా ‘ఎక్కా’. ఈ మూవీ ఆగస్టు మధ్యలోనే ఓటీటీలోకి వస్తుందని చాలా వార్తలే వచ్చాయి. కానీ అలా ఏం జరగలేదు. అంతే కాకుండా ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుందని అన్నారు. కానీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. ఈ సినిమా జీ5 ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. డైరెక్టర్ గా రోహిత్ పడకికి ఇదే ఫస్ట్ మూవీ. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 5నే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి.
అయితే సు ఫ్రమ్ సో, జూనియర్, ఎక్కా సినిమాల ఓటీటీ రిలీజ్ లపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
చివరగా, ఈ మూడు కన్నడ సినిమాలు ఓటీటీలో విడుదల కావడం తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. వీటిలో శ్రీలీల నటన ప్రత్యేక ఆకర్షణ.

