
భారీ అంచనాలతో విడుదలైన కన్నప్ప సినిమాకు మొదటి వారాంతం వసూళ్లు ఆశించినంతగా లేవు. మూడు రోజుల్లో సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసుకుందాం.
Key Points
కన్నప్ప సినిమాకు మొదటి వారాంతం వసూళ్లు ఆశించినంతగా లేవు.
మూడు రోజుల్లో రూ. 22.53 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.
హనుమాన్ సినిమా కలెక్షన్లను అధిగమించలేకపోయింది.
కన్నప్ప మూవీ ఓపెనింగ్ వీకెండ్ రిపోర్ట్
భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన కన్నప్ప సినిమా హీరో మంచు విష్ణుకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. కానీ సినిమా లెవల్ ను బట్టి చూస్తే కలెక్షన్లు మాత్రం తక్కువే. జూన్ 27న రిలీజైన ఈ మూవీకి ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. పైగా ఆదివారం (జూన్ 29) కలెక్షన్లు పడిపోవడం గమనార్హం.
ముకేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలై తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ ను అందించింది. కానీ ఈ చిత్రం హనుమాన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బీట్ చేయడంలో విఫలమైంది. ఇండియాలో కన్నప్ప సినిమా మూడు రోజుల్లో రూ .22.53 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది.
ఆశించినంతగా లేని వసూళ్లు
సక్నిల్క్ ప్రకారం ఆదివారం కన్నప్ప కలెక్షన్లలో మరింత తగ్గాయి. సండే ఈ మూవీ ఇండియాలో రూ .6.03 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే దక్కించుకోగలిగింది. తొలిరోజు రూ.9.35 కోట్లు రాబట్టిన ఈ చిత్రం శనివారం 23.53 శాతం క్షీణించి రూ.7.15 కోట్లు రాబట్టింది. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదలైన ఈ చిత్రం తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఆదివారం తమిళ వెర్షన్ కు 24.83 శాతం ఆక్యుపెన్సీ రాగా, తెలుగు వెర్షన్ కు 42.33 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా 2024లో థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామి రంగా’ వంటి స్టార్ హీరోల చిత్రాలను బీట్ చేసిన ఈ చిత్రం తొలి వారాంతంలో రూ.40.65 కోట్లు రాబట్టింది.
హనుమాన్ సినిమాతో పోలిక
శుక్రవారం థియేటర్లకు వచ్చిన కన్నప్ప సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే ఎదురు కానుంది. ఫస్ట్ వీకెండ్ లో ఆ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వీక్ డేస్ ఎలా పర్ఫామ్ చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఈ రోజు (జూన్ 30) సోమవారం కన్నప్ప సినిమాకు కఠిన పరీక్ష తప్పదు. నేటి వసూళ్లను బట్టి మంచు విష్ణు సినిమా గట్టెక్కుతుందో లేదో చెప్పేయొచ్చు.
మంచు విష్ణు, మోహన్ లాల్, ప్రభాస్ , అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, ఆర్ శరత్ కుమార్, అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మందా, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రుషి, రఘు బాబు, మధూ తదితరులు కన్నప్పలో నటించారు.
మొత్తం మీద, కన్నప్ప సినిమా మొదటి వారాంతం వసూళ్లు నిరాశపరిచాయి. వచ్చే రోజుల్లో సినిమా ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.


