
మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా రాణిస్తోంది. అయితే, సినిమా పైరసీకి గురవుతుండటంతో విష్ణు ఆందోళన చెందుతున్నారు. పైరసీని నివారించాలని ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.
Key Points
కన్నప్ప సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.
సినిమా పైరసీకి గురవుతోందని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు.
30,000 కంటే ఎక్కువ అనధికారిక లింకులను టీమ్ తొలగించింది.
విష్ణు ప్రేక్షకులను పైరసీని నివారించమని కోరారు.
కన్నప్ప సినిమా బాక్సాఫీస్ విజయం
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్‌లో 80 శాతం సీట్లు ఫిల్ అవుతున్నాయి. ఆపై తమిళనాడులో కూడా మంచి టాక్‌తో రన్ అవుతుంది. తెలుగులో కూడా మ్యాట్నీ, సాయంత్రం షోలు హౌస్‌ఫుల్ అయిపోతున్నాయి. అయితే, తాజాగా మంచు విష్ణు తాజాగా సోషల్‌మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
పైరసీ సమస్యతో మంచు విష్ణు ఆందోళన
కన్నప్ప సినిమా పైరసీకి గురైందని నటుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఇప్పటికే సుమారు 30వేలకు పైగానే అనధికారిక పైరసీ లింక్‌లను తమ టీమ్ తొలగించిందని ఆయన పేర్కొన్నారు. పైరసీ అంటే మరొకరి శ్రమను దోచుకోవడమే.. ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుందన్నారు. ఈ విషయంలో చాలా బాధగా ఉందని విష్ణు ఆవేదన చెందారు. ‘ మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి.’ అంటూ విష్ణు కోరారు.
ప్రేక్షకులకు విజ్ఞప్తి
కన్నప్ప సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 58 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీలో ప్రభాస్ పాత్రతో పాటు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందంటూ టాక్ బయటకు రావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. బుక్‌మైషోలో ప్రతిరోజు సుమారు ఒక లక్షకు పైగానే టికెట్లు సేల్ అవుతున్నాయి.
కన్నప్ప సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నప్పటికీ, పైరసీ సమస్య కలవరపరుస్తోంది. ప్రేక్షకులందరూ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని మంచు విష్ణు కోరుతున్నారు.


