
2022లో విజయవంతమైన ‘కాంతార’ చిత్రానికి సీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ రాబోతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలై అనూహ్యమైన ప్రతిస్పందనను అందుకుంది. 24 గంటల్లోనే 107 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది.
Key Points
కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ 24 గంటల్లో 107 మిలియన్ వ్యూస్ సాధించింది!
ప్రభాస్, హృతిక్, పృథ్వీరాజ్, శివకార్తికేయన్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
అక్టోబర్ 2న కన్నడతో పాటు అనేక భాషల్లో విడుదల కానుంది.
రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలను పెంచుతోంది.
కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ రికార్డు సృష్టి
2022లో రికార్డు సృష్టించిన ‘కాంతర’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రాబోతున్న చిత్రం కాంతార: చాప్టర్ 1(Kantara Chapter 1 ). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్, మలయాళంతో పృ థ్విరాజ్, తమిళ్‌లో శివకార్తికేయన్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.
భారీ అంచనాలతో కాంతార: చాప్టర్ 1
ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్త విడుదల
ఈ మూవీలొ రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.


