|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

25 శాతం పడిపోయిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్- సొంత ఇండస్ట్రీలోనే ఎక్కువగా-రికార్డులు, 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published: 04-10-2025, 9:30 AM
25 శాతం పడిపోయిన కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్- సొంత ఇండస్ట్రీలోనే ఎక్కువగా-రికార్డులు, 2 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు సాధించినా, రెండో రోజు కలెక్షన్లు 25 శాతం తగ్గాయి. అయితే, రెండు రోజుల్లోనే భారీ రికార్డులు సృష్టించింది. ఈ సినిమా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్ల వివరాలు చూద్దాం.

Key Points

1

రెండో రోజు కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ 25.63 శాతం పడిపోయాయి.

2

రెండు రోజుల్లో దేశీయంగా రూ. 106.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

4

ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

కాంతార 2వ రోజు కలెక్షన్స్ ఎంత?

కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్ డే 2: 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కంతారా సినిమా ప్రీక్వెల్ అయిన కాంతార 2 అక్టోబర్ 2న రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 అదిరిపోయే టాక్‌తో దూసుకుపోతోంది.

రూ. 125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 సినిమా ఓపెనింగ్ రోజున ఇండియాలో రూ. 61.85 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అందులో సొంత సినీ ఇండస్ట్రీ అయిన కన్నడ నుంచి ఎక్కువగా రూ. 19.6 కోట్లు, హిందీ బెల్ట్ ద్వారా రూ. 18.5 కోట్లు, తెలుగులో రూ. 13 కోట్లు, తమిళంలో 5.5 కోట్లు, మలయాళంలో రూ. 5.25 కోట్ల కలెక్షన్స్ ఉన్నాయి.

అయితే, రెండో రోజు అయిన శుక్రవారం (అక్టోబర్ 3) నాడు కాంతార 2 నెట్ ఇండియా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. దాదాపుగా 25.63 శాతం వరకు రెండో రోజు కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో ఇండియాలో కాంతార 2 సినిమాకు రూ. 45 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డులు

ఇక రెండు రోజుల్లో కలిపి భారతదేశంలో కాంతార చాప్టర్ 1 సినిమాకు రూ. 106.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు సమాచారం. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా కాంతార 2 అవతరించింది.

అలాగే, ఇండియాలో ఓపెనింగ్ రోజున రూ. 74.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడంతో టాప్ 15 అతిపెద్ద దక్షిణ భారత చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాంతారా చాప్టర్ 1 వివిధ భాషల్లో విడుదలైనప్పటికీ దాని ఒరిజినల్ వెర్షన్ కన్నడలోనే బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తోంది.

ఆ తర్వాత తరువాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళ స్క్రీనింగ్స్‌లలో కాంతార 2 రన్ అవుతోంది. ఇక కాంతారా చాప్టర్ -1 అక్టోబర్ 3న మొత్తం 82.31 శాతం కన్నడ థియేటర్లలో ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

ఏ భాషలో ఎక్కువ వసూళ్లు?

కాగా, కాంతారా చాప్టర్ 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 87.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఆరంభం చేసింది. ఇది యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత కన్నడ రెండో సినిమాగా రికార్డ్ అందుకుంది. అలాగే, రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, హొంబాలే ఫిలిమ్స్ నిర్మించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అలరించింది. అలాగే, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర కీలక పాత్రలు పోషించారు.

మొదటి రోజు కంటే కలెక్షన్లు తగ్గినప్పటికీ, కాంతార చాప్టర్ 1 రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటింది. ఇది కన్నడ సినీ చరిత్రలో ఒక మైలురాయి. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.