|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kantara Chapter 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1.. ఆ లిస్ట్‌లో రెండో చిత్రంగా రికార్డ్!

Published: 08-10-2025, 9:44 AM
Kantara Chapter 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1.. ఆ లిస్ట్‌లో రెండో చిత్రంగా రికార్డ్!

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లు రాబట్టి KGF-2 తర్వాత రెండో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

Key Points

1

కాంతార చాప్టర్ 1 తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది.

2

ఈ చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే రూ.400 కోట్ల క్లబ్‌లో చేరింది.

4

KGF-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ చిత్రంగా నిలిచింది.

కాంతార చాప్టర్ 1 వసూళ్ల ప్రభంజనం

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ ‌-1 బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది . తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది . ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ ‌ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ .400 కోట్ల క్లబ్ ‌ లో చేరింది . ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ ‌ చేరుకుంది . ప్రపంచవ్యాప్తంగా రూ .427 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది .

ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది . ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్ ‌ ను దాటేసింది . కేజీఎఫ్ – 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది . కాగా .. 2022లో విడుదలైన ‘కాంతార’ సినిమా రూ.408 కోట్ల ఆల్ ‌ టైమ్ వసూళ్లు రాబట్టింది . కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ -2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది . కాంతార చాప్టర్ -1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ .500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది . కాగా .. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ , ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే.

400 కోట్ల క్లబ్‌లో చాప్టర్ 1

KGF-2 తర్వాత రికార్డ్ సృష్టి

కాంతార చాప్టర్ 1 వారం రోజుల్లో రూ.500 కోట్లు దాటే అవకాశం ఉంది. KGF-2 తర్వాత కన్నడ సినిమా సత్తాను చాటిన ఈ చిత్రం, రిషబ్ శెట్టికి గొప్ప విజయాన్ని అందించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.