
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార చాప్టర్-1’ అద్భుత విజయాన్ని అందుకుంది. గతంలో సూపర్‌హిట్ అయిన కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. రిషబ్ శెట్టి తన చిత్ర విజయానికి సహకరించిన ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు తెలిపారు.
Key Points
కాంతార చాప్టర్-1 సూపర్‌హిట్ కాంతారకు ప్రీక్వెల్‌గా విడుదలైన చిత్రం.
బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూలు చేసి ఈ ఏడాది రికార్డు సృష్టించింది.
షూటింగ్‌కు సహకరించిన ఉదయ్ కుమార్ శెట్టి, వినయ్ కుమార్ శెట్టిలకు రిషబ్ శెట్టి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది.
కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద విజయం
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.
రిషబ్ శెట్టి కృతజ్ఞతలు.. ఎవరికి?
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కాంతార టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మూవీ షూటింగ్ సహకరించిన అన్నదమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. కుందాపురకు చెందిన ఉవా మెరిడియన్ ఫిల్మ్ స్టూడియో యాజమానులు ఉదయ్ కుమార్ శెట్టి, వినయ్ కుమార్ శెట్టి తమ సినిమా కాంతార చాప్టర్-1 ఎంతో సహకరించారని అన్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కోసం 22 వేల చదరపు అడుగుల ఏసీ సెట్‌ను రూపొందించారని వెల్లడించారు. ఇందులోనే ఇండోర్ సీక్వెన్స్ తెరకెక్కించామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తన మూవీకి మద్దతుగా నిలిచిన మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారీ నిర్మాణ వ్యయం, రికార్డు వసూళ్లు
కాంతార చాప్టర్-1 మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సినిమా ఛావాను అధగమించింది. అంతేకాకుండా కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు.
‘కాంతార చాప్టర్-1’ కేవలం కన్నడలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించి, ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. రిషబ్ శెట్టి విజయం వెనుక ఉన్న సహకారాన్ని గుర్తించి ధన్యవాదాలు తెలపడం ప్రశంసనీయం.


