
కాంతార సినిమా తర్వాత, దాని ప్రీక్వెల్ అయిన కాంతార ఛాప్టర్ 1 ట్రైలర్ విడుదలైంది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా సందర్భంగా విడుదల కానుంది. ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Key Points
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం
దసరాకు సినిమా విడుదల
కాంతార ప్రీక్వెల్ గా ఈ సినిమా
కాంతార ఛాప్టర్ 1 ట్రైలర్ విడుదల
కాంతార ఛాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది. ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటించి, డైరెక్ట్ చేసిన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్. అసలు కాంతారలో ఏం జరిగిందన్నది ఈ మూవీ కళ్లకు కట్టబోతోంది. సోమవారం (సెప్టెంబర్ 22) రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత భారీగా పెంచేసింది.
మూడేళ్ల కిందట వచ్చిన కాంతార మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. కర్ణాటకలోని ఓ సాంప్రదాయ కళను ప్రధాన కథాంశంగా తీసుకొని తీసిన ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడీ మూవీ ప్రీక్వెల్ కాంతార ఛాప్టర్ 1 వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. కాంతార కంటే భిన్నంగా ఈసారి గత చరిత్రను ఈ ప్రీక్వెల్లో చూపించబోతున్నారు. అంతేకాదు ఈ ట్రైలర్ లో భారీతనం కనిపిస్తోంది.
రిషబ్ శెట్టి యొక్క అద్భుతమైన నటన
గ్రాండ్ విజువల్స్, రిషబ్ శెట్టి యాక్షన్, యువరాణిగా రుక్మిణి వసంత్ రోల్, విలన్ గా బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఈ ట్రైలర్లో ప్రధాన హైలైట్స్ గా చెప్పొచ్చు. కాంతార కథను కట్టుకథగా చెప్పే రాజు, ఆ అడవిని నాశనం చేయడానికి అతడు చేసే ప్రయత్నం, తమ అడవిని కాపాడుకునేందుకు మూవీలో లీడ్ రోల్ చేసే ప్రయత్నాల చుట్టూ ఈ ట్రైలర్ తిరిగింది. అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసింది.
కాంతార ఛాప్టర్ 1లోనూ రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్నాడు. అతడే ఈ సినిమాకు కథ అందించి, డైరెక్ట్ చేశాడు. కాంతారలో అతని నటనకుగాను 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు అతన్ని వరించింది. ఇప్పుడు కాంతార ఛాప్టర్ 1లోనూ అతడు అలాంటి మరో పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ట్రైలర్ తోనే స్పష్టమైంది. ఈ ప్రీక్వెల్ లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్యలాంటి వాళ్లు వచ్చి చేరారు.
దసరాకు గ్రాండ్ రిలీజ్
తొలి సినిమా బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ షూటింగ్ సందర్భంగా ఎన్నో అడ్డంకులు ఎదురైనా అన్నింటినీ అధిగమించి మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి దసరా వీకెండ్ సందర్భంగా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
కాంతార ఛాప్టర్ 1 ట్రైలర్ అంచనాలను పెంచింది. రిషబ్ శెట్టి నటన, భారీ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. దసరా సందర్భంగా విడుదలయ్యే ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుందని ఆశిద్దాం.


