|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

BREAKING: హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త హఠాన్మరణం

Published: 12-06-2025, 4:43 PM
BREAKING: హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త హఠాన్మరణం

ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం చెందారు. 53 ఏళ్ల సంజయ్ పోలో ఆడుతుండగా గుండెపోటుతో కన్నుమూశారు. యూకేలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Key Points

1

ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం.

2

పోలో ఆడుతున్న సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు.

4

ఆటోమేటివ్ వ్యాపార రంగంలో సంజయ్ గుర్తింపు పొందారు.

సంజయ్ కపూర్ హఠాన్మరణం

దిశ‌, వెబ్ డెస్క్: ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ హఠాన్మరణం చెందారు. సంజయ్ వయసు 53ఏళ్లుగా ఆయన పోలో ఆడుతూ గుండెపోటుతో కన్నుమూశారు. సంజయ్ కపూర్ యూకేలో ఉండగా ఆయన పోలో గేమ్ లో గుర్రాన్ని నడుపుతున్న సమయంలో తేనెటీగ నోటిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కొంత ఇబ్బంది పడగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టు సమాచారం.

వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్వ్యాపారవేత్తలలో ఒకరు. కరిష్మా కపూర్ మొదట 2003లో సంజయ్‌ని వివాహం చేసుకున్నారు. కాగా ఈ జంట 2014లో విడాకులు తీసుకుంది. ఆ తరవాత ప్రియా సచ్ దేవ్‌ను సంజయ్ వివాహం చేసుకున్నాడు. ఇక ఆయన గుండెపోటుతో మరణించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆటోమేటివ్ వ్యాపార రంగంలో సంజయ్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. సంజ‌య్ మృతి ప‌ట్ల‌ సినీ, వ్యాపార ప్ర‌ముఖులు సంతానం ప్ర‌క‌టిస్తున్నారు.

పోలో ఆట సమయంలో గుండెపోటు

కరిష్మా కపూర్ కుటుంబంలో విషాదం

సంజయ్ కపూర్ హఠాన్మరణం సినీ, వ్యాపార ప్రముఖులను కలచివేసింది. ఆటోమోటివ్ రంగంలో ఆయన సేవలను చిరకాలం గుర్తుంచుకుంటారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.