
కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. కార్తీక్ ఆత్మాభిమానం, బాధ్యతలపై నిలబడగా, శ్రీధర్ సహాయం అందించే ప్రయత్నం చేశాడు. దీప అనారోగ్యం, కుటుంబ కలహాలు సీరియల్‌కు మరింత ఉత్కంఠను జోడించాయి. జ్యోత్స్న డిమాండ్, శ్రీధర్ బ్లాంక్ చెక్ కథనాన్ని కీలక మలుపు తిప్పాయి.
Key Points
కార్తీక్ తన బాధ్యతలను స్వయంగా నిర్వర్తించాలని పట్టుదలగా ఉన్నాడు.
శ్రీధర్ కార్తీక్‌కు సహాయం చేయాలని ప్రయత్నించగా, కార్తీక్ తిరస్కరించాడు.
దీప అనారోగ్యం గురించి కుటుంబ సభ్యులకు తెలిసి, సుమిత్ర సేవలు చేసింది.
జ్యోత్స్న 10 కోట్లు డిమాండ్ చేయగా, శ్రీధర్ కార్తీక్ కోసం బ్లాంక్ చెక్ ఇచ్చాడు.
కార్తీక్ ఆత్మాభిమానం, శ్రీధర్ సహాయం
కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో శ్రీధర్ ఇచ్చిన డబ్బులను కార్తీక్ కు కనిపించకుండా దాచేస్తుంది కాంచన. ఈ సరుకులు మీ నాన్న తీసుకొచ్చారని కార్తీక్ కు అనసూయ చెప్తుంది. సరుకులు అవసరం లేదు. అవసరాలకు, బాధ్యతలకు తేడా తెలుసుకోవాలి. అవసరాలు తీర్చాల్సింది తండ్రే. కానీ ఈ ఇంటి బాధ్యత నాదేనని కార్తీక్ అంటాడు. డబ్బు ఇచ్చాడని తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందోనని కాంచన అనుకుంటుంది.
ఈ సరుకులు కార్లో పెడితే నేను ఈ ఇంటికి మళ్లీ రాను. మీరు మా కోసం ఏమైనా చేయొచ్చు, కానీ మీ కోసం మేం ఏం చేయకూడదా? అవసరం లేదనుకుంటే కార్లో పెట్టించెయ్. కానీ ఓ తండ్రిగా కుమిలి కుమిలి ఏడుస్తా. మీ తాత ఇంట్లో డ్రైవర్ గా పని చేయడం నాకు ఇష్టం లేదు. ఇటు కొడుకు జీవితం, అటు కూతురి జీవితం అలాగే ఉంది. అల్లుడు, కొడుకు ఏం చేస్తున్నాడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా. నీ కారణంగా నాకేదో అవమానం జరుగుతుందని చెప్పడం లేదు. నీకోసం ఏం చేయాలో చెప్పు చేస్తానని శ్రీధర్ అంటాడు. సరుకులు ఇక్కడే ఉంచి ఇంటికి వెళ్లిపోండి మాస్టారూ అని కార్తీక్ చెప్తాడు.
మీ ఆవిడకు ఎలా ఉందని శ్రీధర్ అడుగుతాడు. దీంతో దీప కు జరిగింది అనసూయ, కాంచనకు తెలుస్తుంది. సుమిత్రత్త భోజనం పెట్టిందని కార్తీక్ అంటాడు. అత్త ఏం దీపను క్షమించలేదు. ఇలా ఇంట్లో పడిపోతే చెడ్డ పేరు మాకు. నేను ఏమైనా చేశానని అనుకుంటారని భోజనంతో పాటు నాలుగు తిట్లు కూడా పెట్టింది. ఈవిడది భూదేవి సహనం కదా అందుకే అన్ని లోపల భరించిందని కార్తీక్ చెప్తాడు. వదిలేయ్ బావ అని దీప అంటుంది. మరోసారి సరుకులు తీసుకురావద్దని శ్రీధర్ కు చెప్తాడు కార్తీక్.
నువ్వు మాత్రం డ్రైవర్ గా పనిచేయడం ఇష్టం లేదు. ఈ మాట గుర్తు పెట్టుకోమని శ్రీధర్ వెళ్లిపోతాడు. ఓ సంకల్పంతో ఈ పని చేస్తున్నానని కార్తీక్ అనుకుంటాడు. ఈ డబ్బుల గురించి వీడికి చెప్పాలా? వద్దా? అని కాంచన ఆలోచిస్తుంది. మరోవైపు సుమిత్ర భోజనం చేయకుండా ఉంటుంది. నాన్న తినకుండా మీ మమ్మీ తినదే. డాడీని పిలవమని జ్యోత్స్నకు చెప్తుంది పారిజాతం. జ్యో పిలిస్తే తర్వాత తింటానని దశరథ అంటాడు. జ్యోత్స్న గొడవ చేయడానికి సిద్ధమవుతుంది.
దీప పరిస్థితిపై కుటుంబంలో చర్చ
ఈ రోజు దీప కళ్లు తిరిగి పడిపోతే మమ్మీ మాత్రమే ఇంట్లో ఉంది. కానీ వదల్లేదు. కూర్చొబెట్టి సేవలు చేసింది. భోజనం పెట్టింది. నీ కోణంలో నుంచి ఆలోచిస్తే దీప మమ్మీకి శత్రువు. కానీ మమ్మీ అలా కాదు. దీప నిజం ఒప్పుకొంటే క్షమించడానికి మమ్మీ సిద్ధంగా ఉంది. తప్పు ఎవరిలో ఉంది? ఎవరిని నిందించాలి? ఎవరిని దూరం పెట్టాలి? ఇదంతా విన్న ఎవరైనా దీపనే దూరం పెట్టాలని అంటారు. కానీ మీరు మమ్మీని దూరం పెట్టారు. ఆవిడతో మాట్లాడటం నచ్చదని జ్యో అంటుంది.
అవును, నచ్చదు. ఒక తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవడానికి ఓ అవకాశం ఉంటుంది. కానీ అవకాశం దొరికినప్పుడు తప్పు చేస్తే కోపం ఎలా పోతుందని దశరథ అంటాడు. ఎవరి గురించో మాట్లాడి మమ్మీ, డాడీ మధ్య దూరం పెంచకు. జ్యోత్స్న చెబితే కానీ నా కోడలిని క్షమించాలని దశరథకు తెలియదా. నేను ఊరుకుంటానా? దశరథ పద భోజనం చేద్దామని శివన్నారాయణ అంటాడు. ప్రయత్నం గట్టిగానే చేశావు కానీ రిజల్ట్ అనుకున్నంత రాలేదని జ్యోతో పారు అంటుంది.
అల్లుడు జాబ్ చేసుకుంటానన్నారు. కానీ కార్తీక్ విషయంలో ఏం చేయలేకుండా ఉందని శ్రీధర్ తో కావేరీ అంటుంది. నా కొడుకుని పని వాడిలాగా చూడలేకపోతున్నా. గదిలో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నా. వాడి కోసం ఏదో ఒకటి చేస్తానని శ్రీధర్ అంటాడు. ఒక పెగ్గు మందు వేస్తే ఐడియా అదే వస్తుందంటాడు.
జ్యోత్స్న డిమాండ్, శ్రీధర్ బ్లాంక్ చెక్
పొద్దున శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు శ్రీధర్. నా మేన కోడలి కోసం వచ్చా. అందరినీ పిలిపించండి మాట్లాడాలని శ్రీధర్ అంటాడు. అందరూ వచ్చాక శ్రీధర్ స్టార్ట్ చేస్తాడు. జ్యోత్స్న నా కొడుకు డ్రైవర్ గా పనిచేయడం నాకిష్టం లేదు. నువ్వు వాడితో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నావంటా. నా కళ్ల ముందు జరగలేదు కాబట్టి ఎలాంటి కండీషన్లు పెట్టుకున్నారో నాకు పూర్తిగా తెలియదు. నా కొడుకు అగ్రిమెంట్ అనే జైలు నుంచి విడుదల కావాలి. అందుకే వచ్చానని శ్రీధర్ అంటాడు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది ప్రేమ అని పారు అంటుంది.
అవును, తాత. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే జరిమానా రూ.10 కోట్లు కట్టాలని జ్యో అంటుంది. నేను రూ.10 కోట్లు కడతానని బ్లాంక్ చెక్ ఇస్తాడు. నా కొడుకు కోసం ఆస్తి మొత్తం రాసివ్వమన్నా ఇస్తానని శ్రీధర్ అంటాడు. ఈ చెక్ తీసుకుని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెక్ టేబుల్ మీద పెడతాడు శ్రీధర్. బావ కోసం రూ.10 కోట్లు ఇవ్వడం ఓకే. కానీ ఇవ్వాల్సింది నువ్వు కాదు బావ అని జ్యో అంటుంది.
అప్పుడే కార్తీక్, దీప వస్తారు. మామయ్య వచ్చిందే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించడానికి అని కార్తీక్ కు చెప్తుంది జ్యో. నువ్వెందుకు అడిగావంటాడు కార్తీక్. మీ ఇద్దరి మధ్య బాధ్యతలు, అధికారాలు ఉంటాయి. నీ నిర్ణయం దగ్గరే ఆగిపోయిన సమస్య ఇది. ఈ సారి సరైన నిర్ణయం తీసుకుంటావని నా ఆశ. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే రూ.10 కోట్లు కట్టాలంటా. నిన్ను రిలీవ్ చేయడానికి మీ నాన్న రూ.10 కోట్ల చెక్ ఇచ్చాడని దశరథ అంటాడు. నా నిర్ణయమే నీ నిర్ణయమని చెప్పమని శ్రీధర్ అడుగుతాడు. అగ్రిమెంట్ కు ఇది జడ్జ్ మెంట్ డే అని శ్రీధర్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తంగా, నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ భావోద్వేగ ఘట్టాలతో నిండి ఉంది. కార్తీక్, దీప భవిష్యత్తు, జ్యోత్స్న డిమాండ్ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. శ్రీధర్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.


