
📌 Key Points
- సుమిత్ర టాబ్లెట్స్ చెత్తబుట్టలో వేసిన జ్యోత్స్న! ఇది చూసిన దశరథ్ షాక్!
- కార్తీక్ నిర్ణయంతో కాంచన సంతోషం! దీప బ్లడ్ రిపోర్ట్ పై టెన్షన్ టెన్షన్!
- జ్యోత్స్నను హెచ్చరించిన దశరథ్! గదిలోకి రావొద్దని వార్నింగ్!
- ముసుగులో పారిజాతం ఎంట్రీ! జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన పారు!
కార్తీక దీపం 2 సీరియల్ లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. అసలు ఏం జరిగింది? ఈ సీరియల్ లోని అసలు రహస్యాలు ఏమిటి? చూస్తూనే ఉండండి!
సుమిత్ర టాబ్లెట్స్ పై జ్యోత్స్న కుట్ర!
కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 31వ ఎపిసోడ్‌లో సుమిత్రి బతికి ఉంటే ప్రమాదం అని ట్యాబ్లెట్స్ చెత్త బుట్టలో పడేస్తుంది జ్యోత్స్న. అది దశరథ్ చూసి నిలదీస్తాడు. కవర్ చేసి తప్పించుకున్న జ్యోత్స్నను ఇంకోసారి ఈ గదిలోకి రావొద్దని చెబుతాడు దశరథ్. కార్తీక్ చెప్పినట్లుగా జ్యోత్స్నను ఎడాపెడా వాయిస్తుంది పారిజాతం.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కాంచన నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నానని, కానీ, కొడుకుగా కలిసి ఉండాలని కోరుకుంటాను అని కార్తీక్ చెబుతాడు. ఆరోగ్యం బాలేనప్పుడు నాన్‌వెజ్ తినడం మానేసింది ఉదాహరణగా చెప్పి నిర్ణయాలు తీసుకునేది పాటించడానికే అని, కేవలం మిమ్మల్ని పిలిచింది కాశీ, స్వప్నలను కలపడానికి అని కాంచన అంటుంది.
దీప చేతికి బ్యాండేజ్ చూసిన కాంచన నువ్వు రక్తం ఇచ్చావా అని అడుగుతుంది. సుమిత్ర కోసం దీప బ్లండ్ శాంపిల్స్‌కు ఇచ్చిన బ్యాండేజ్ చూపిస్తుంది. గైనకాలజస్ట్ దగ్గరికి వెళితే టెస్ట్ కోసం దీప బ్లడ్ తీసుకున్నారని, బిడ్డ ఎదుగుదల బాగుందని కార్తీక్ కవర్ చేస్తాడు. దాంతో కాంచన సంతోషిస్తుంది. సుమిత్ర ఆరోగ్యం గురించి అడుగుతుంది కాంచన.
ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వేసుకుంటే రోగం ముదరదు. వేసుకోకుంటే నిద్రలోనే ప్రాణం పోయే ప్రమాదం ఉందని, కానీ మావయ్య జాగ్రత్తగా చూసుకుంటాడు అని కార్తీక్ అంటాడు. నా భయమంతా జ్యోత్స్న మీదే ఉందని దీప అనుకుంటుంది. మరోవైపు సుమిత్ర దగ్గరికి వెళ్లిన జ్యోత్స్న పారు అన్న మాటలు తలుచుకుంటుంది.
దశరథ్ కు షాక్ ఇచ్చిన జ్యోత్స్న!
అది దశరథ్ చూస్తాడు. తండ్రిని చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. ట్యాబ్లెట్స్ ఎందుకు డస్ట్ బిన్‌లో ఎందుకు వేశావ్ అని దశరథ్ నిలదీసాడు. పారిజాతం వస్తే దశరథ్ నిజం చెబుతాడు. దాంతో పారు తిడుతుంది. ఇంతలో శివ నారాయణ కూడా వచ్చి నిలదీస్తాడు. కింద పడిన ట్యాబ్లెట్స్ పని చేస్తాయా అని రివర్స్‌లో జ్యోత్స్ననే నిలదీస్తుంది. ఇంతలో సుమిత్ర నిద్ర లేస్తుంది.
జ్యోత్స్న చేసింది దశరథ్ చెబుతాడు. అన్ని పడేసినట్లు మాట్లాడతరేంటీ అని ఒక్క ట్యాబ్లెట్ చూపిస్తుంది జ్యోత్స్న. అన్ని పడేసింది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని దశరథ్ అనుకుంటాడు. ట్యాబ్లెట్ ఉంది కదా దశరథ అని పారు అంటుంది. నా భార్యను నేను చూసుకుంటాను. లేదా దీప, కార్తీక్ చూసుకుంటారు. ఒక చిన్న హెల్ప్ చేయమ్మా. నువ్వు ఈ రూమ్‌కి రావొద్దమ్మా. ఏదైనా అవసరం ఉంటే నేనే పిలుస్తాను అని జ్యోత్స్నతో దశరథ్ అంటాడు.
డోర్ తీయగానే ముసుగుతో పారిజాతం దర్శనం ఇస్తుంది. పారును చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. నిన్ను ఓ కంట కనిపెట్టడానికే ఇక్కడ ఉన్నా అని పారు అంటే.. ఇలా చేయమని ఎవరు చెప్పారని జ్యో అంటే నేనే అని కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. ఈ టైమ్‌లో ఎక్కడికే వెళ్తున్నావ్ అని పారు అంటుంది. బావ అడగమంటే అడుగుతావా అని జ్యో అంటుంది.
ముసుగుతో పారిజాతం ఎంట్రీ – ఏం జరగనుంది?
పారు అని కార్తీక్ అనగానే జ్యోత్స్నను లాగిపెట్టి కొడుతుంది పారిజాతం. ఆన్సర్ రాకుంటే ఈ పీజే పీకుతుంది అని కార్తీక్ చెప్పినట్లే చేస్తుంది పారిజాతం. ఫ్రెండ్ దగ్గరికి అని జ్యో అంటే కార్తీక్ నమ్మట్లే అంటాడు. నమ్మట్లేదట అని జ్యోత్స్నను ఎడాపెడా కొడుతుంది పారిజాతం. నిజం చెప్పేదాకా వాయించేస్తుంది పారిజాతం.
పారు మురిసిపోతుంది. జ్యోత్స్ను లోపలికి లాక్కెళ్తుంది పారిజాతం . శివ నారాయణ కూడా వెళ్తాడు. కార్తీక్‌తో దశరథ్ మాట్లాడుతాడు. మరోవైపు తను చెప్పినట్లు చేస్తే దాసును కనిపెడతానన్నాడు కార్తీక్ అని పారు చెబుతుంది.
మరోవైపు జ్యోత్స్న ట్యాబ్లెట్స్ వేయడం నేను చూశాను. ఇప్పుడు ఇంటి నుంచి వెళ్లాలనుకుంది. జ్యోత్స్న ఎందుకు భయపడుతుంది. దాసు ఏమయ్యాడు, దాసును జ్యోత్స్న ఎందుకు చంపాలని చూసింది, దీపపై ఎటాక్ చేయించింది ఎవరు, జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అని కార్తీక్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు దశరథ్ .
కార్తీక దీపం 2 సీరియల్ లో రోజుకో సంచలనం! జ్యోత్స్న కుట్రలు ఫలిస్తాయా? సుమిత్రను కాపాడేది ఎవరు? మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి!


