
కార్తీక దీపం 2 లోని ఈరోజు ఎపిసోడ్ లో జ్యోత్స్న, శౌర్య కిడ్నాప్ ప్లాన్ చేస్తుంది. కానీ శివన్నారాయణ అనుకోకుండా శౌర్యను కాపాడతాడు. జ్యోత్స్న ఇంకా వదులుకోదు. ఆమె కొత్త ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
Key Points
శౌర్య కిడ్నాప్ ప్రయత్నం విఫలం.
శివన్నారాయణ అనుకోకుండా శౌర్యను కాపాడటం.
జ్యోత్స్న యొక్క కొత్త ప్లాన్.
పాలల్లో మత్తు మందు ఉపయోగించే ప్రయత్నం.
శౌర్య కిడ్నాప్ ప్రయత్నం
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఆగస్టు 25వ తేదీ ఎపిసోడ్ లో పెళ్లి ఎలా ఆపాలనే ప్లాన్ కోసం జ్యోత్స్న, పారిజాతం, శ్రీధర్ మాట్లాడుకుంటారు. శౌర్యను కిడ్నాప్ చేస్తున్నానని జ్యో అంటుంది. ఐడియా అదిరిపోయింది. ఏ రోజుకైనా నువ్వే నా కోడలివి. నా కొడుక్కి నేను చేసే మంచి ఏమైనా ఉందంటే అది నిన్ను ఇచ్చి పెళ్లి చేయడమే అని జ్యోతో శ్రీధర్ అంటాడు. మామయ్య శౌర్యను నువ్వే కిడ్నాప్ చేయాలని శ్రీధర్ తో జ్యో చెప్తుంది. ఓకే అని శ్రీధర్ వెళ్లిపోతాడు.
కార్తీక్, దీప పెళ్లి జరుగుతుంది. అప్పుడే వెళ్లిన పని సక్సెన్ అని జ్యోత్స్న , పారుకు చెప్తాడు శ్రీధర్. ఎక్కడ దాచావని అడిగితే సైలెంట్ గా ఉండమని చెప్తాడు. కాలం నీ కథను ఎంత వింతగా రాసిందో చూశావా మరదలా. నిన్ను పరాయి దానిలా చూస్తున్న సుమిత్ర అత్త నీ కన్న తల్లి. కానీ నువ్వు ఆవిడకు శత్రువు. ఇక్కడ నిలబడ్డవాళ్లంతా మన రక్త బంధాలే. వరస పెట్టి పిలవడానికి ఉన్నది ఒక్క రోజే. రేపటి నుంచి మనం పని మనుషులమే. హ్యాపీగా ఉండు. ఫొటోలు అందంగా రావాలి కదా. నవ్వు మరదలా అని కార్తీక్ చెప్పడంతో దీప సంతోషపడుతుంది.
జ్యోత్స్నతో చేసిన ఛాలెంజ్ లో నువ్వే గెలిచావని దీప అంటుంది. శౌర్యను తీసుకురమ్మని అనసూయకు చెప్తుంది కాంచన. శౌర్య ఎక్కడా కనిపించదు. శౌర్య కనబడటం లేదని అనసూయ చెప్పడంతో కాంచన కంగారు పడుతుంది. అది విని పారు కావాలనే గట్టిగా శౌర్య కనిపించడం లేదా అని అరుస్తుంది. వేరే దారి లేక శౌర్యను జ్యోత్స్ననే ఏదో చేసి ఉంటుంది. పెళ్లి జరగకున్నా పర్వాలేదు కానీ శౌర్యకు ఏమైనా అయిందో జ్యోత్స్నను బతకనివ్వను అని దీప అంటుంది. కార్తీక్, దీప శౌర్యను వెతకడానికి వెళ్తారు. గ్రానీ పెళ్లి ఆగిపోయినట్లే అని పారుతో జ్యో అంటుంది.
శివన్నారాయణ ఆకస్మిక ప్రవేశం
అక్కడ ఉన్న పాప శౌర్యను ఎవరో కార్లో తీసుకుని వెళ్లారని చెప్తుంది. కారు కీస్ తీసుకుని కార్తీక్, దీప వెళ్లాలని అనుకుంటుండగా నాన్న అంటూ శౌర్య వస్తుంది. జ్యోత్స్న, పారు, శ్రీధర్ షాక్ అవుతారు. ఇదిగో ముద్దుల తాతే తీసుకెళ్లాడని శౌర్య శివన్నారాయణను చూపిస్తుంది. చంటిదానికి బట్టలు కొనడం మర్చిపోయినట్లున్నారు. అందుకే షాపింగ్ మాల్ పక్కనే కదా వెంటనే వచ్చేద్దామని తీసుకెళ్లానని శివన్నారాయణ అంటాడు. శౌర్య కనబడకపోయే సరికి అందరం కంగారు పడ్డామని దశరథ్ అంటాడు.
శౌర్యను కిడ్నాప్ చేశానన్నావు అని శ్రీధర్ ను పిలిచి పారు మెల్లగా అడుగుతుంది. చేశాను అత్తయ్య అని శ్రీధర్ అంటాడు. అప్పుడే లిఖిత లిఖిత అని పిలుస్తూ మరొకరు వచ్చి నా పాప కనిపించట్లేదని అంటారు. శౌర్య అనుకొని వేరే పిల్లను కిడ్నాప్ చేశానా? అని శ్రీధర్ అనుకుంటాడు. ఆ పాప ఏడుస్తూ వస్తుంది. నేను గదిలో ఆడుకుంటుంటే ఎవరో డోర్ పెట్టారని ఆ పాప చెప్తుంది. కళ్ల జోడు మార్చాల్సింది కాదని శ్రీధర్ అనుకుంటాడు.
సుమిత్ర పదా అబ్బాయికి బట్టలు పెట్టాలి. మా చెల్లి, బావ కలిసి అమ్మాయికి బట్టలు పెడతారని దశరథ్ అంటాడు. నువ్వు నీ కొడుకుతో కలిసిపోయి నన్ను మోసం చేశావు కదా అని శ్రీధర్ తో జ్యోత్స్న అంటుంది. నిన్ను మోసం చేసింది నేను కాదు కళ్లజోడు అని అంటాడు శ్రీధర్. నీ కొడుకు దీపను పెళ్లి చేసుకుంటే నీకు జరిగే నష్టం కంటే నాకు జరిగే నష్టమే ఎక్కువే. ఏం చేయాలో నాకు తెలుసు. కానీ ఎవరికీ చెప్పను మామయ్య అని జ్యోత్స్న వెళ్లిపోతుంది.
జ్యోత్స్న యొక్క కొత్త పన్నాగం
నీ కూతురిని నా ఇంటి కోడలిని చేసుకోవాలన్నది మన ఇద్దరి మధ్య తీరకుండా ఉన్న ఓ కోరిక. అది తీరలేదన్న బాధ పైకి చెప్పకపోయినా నాలో ఇప్పటికీ ఉందన్నయ్యా. ఇప్పుడు నా కోడలికి నా అన్న ఇల్లు పుట్టిల్లు అయింది. నీకు పుట్టకపోయిన దీప నీ కూతురు అయింది. నువ్వు కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే నువ్వు నాకు వియ్యంకుడివి అవుతావు. నా అన్నయ్య కూతురు నా కోడలు అవుతుంది. అప్పుడు నీ దగ్గర తీసుకున్న మాట నిజమైనట్లే అవుతుంది. నా పుట్టింటి నుంచి వియ్యం అందుకోలేదన్న బాధ నాకు పోయినట్టే కదా అని దశరథ్ తో కాంచన అంటుంది.
నా కొడుకు పెళ్లి నాన్న చేతుల మీదుగా జరుగుతుంది ఇంతకంటే కావాల్సింది ఇంకేముంది అన్నయ్య అని కాంచన ఎమోషనల్ అవుతుంది. మరోవైపు పాలల్లో మత్తు మందు కలుపుతుంది జ్యోత్స్న. మామయ్య ఇది ప్లాన్ బి. ఈ పాలు నాకు కాదు దీపకు. ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలే టైమ్ ఉంది. ఈ పాలు తాగితే దీప గంట వరకు లేవదు. ముహూర్తం దాటిపోతే ఈ పెళ్లి జరగదని శ్రీధర్ తో జ్యోత్స్న చెప్తుంది. దీపకు నేనే ఈ పాలు తీసుకెళ్లి ఇస్తానని జ్యో అంటుంది. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిక్షణంలో శివన్నారాయణ ప్రవేశంతో శౌర్యను కాపాడబడింది. జ్యోత్స్న యొక్క దుష్ట పన్నాగాలు విఫలమవుతూనే ఉన్నాయి. కథ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.


