|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ కండిషన్‌కు ఒప్పుకున్న శివ నారాయణ- కూతురు కోసం కంటతడి-జ్యోత్స్న ప్రశ్న, పారు విజిల్

Published: 10-08-2025, 10:11 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ కండిషన్‌కు ఒప్పుకున్న శివ నారాయణ- కూతురు కోసం కంటతడి-జ్యోత్స్న ప్రశ్న, పారు విజిల్

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో, కార్తీక్ పెళ్లికి సుమిత్ర, దశరథ్ అమ్మనాన్నలుగా ఉండాలనే కండిషన్‌కు శివనారాయణ ఒప్పుకుంటాడు. జ్యోత్స్న ప్రశ్నలతో పాటు దీప, పారుల మధ్య వాగ్వాదం ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మారుస్తుంది.

శివనారాయణ కంటతడి

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర, దశరథ్ అమ్మనాన్నలుగా దీప పెళ్లి చేయాలనే కండిషన్ గురించి జ్యోత్స్న అడుగుతుంది. నువ్ ఇలాంటి కండిషన్ పెట్టడం వెనుక దీప ఉద్దేశం ఏంటీ అని జ్యోత్స్న అడుగుతుంది. నేను అడిగేంతవరకు తనకు తెలియదు. అయినా ఉద్దేశం గురించి ఎందుకు అని కార్తీక్ అంటాడు.

మరి బజార్‌లో ఇంకెవరిదైన చేయి తగిలి తాళి తెగిపోతే వాళ్లను తిట్టి వదిలేస్తావా. లేదా వాళ్ల అమ్మనాన్నలను తల్లిదండ్రులుగా పెళ్లి చేయాలని అంటావా అని జ్యోత్స్న అడుగుతుంది. దానికి విజిల్ కొట్టి ఏం అడిగావే. నువ్ లా చదివి ఉంటే లాయర్ అయ్యేదానివి అని పారిజాతం అంటుంది.

రేయ్ కార్తీక్ చెప్పురా దీనికి సమాధానం. ఇది ఎవరు అనుకున్నావురా. శివ నారాయణ మనవరాలు. ఆడపులి. పంజా దెబ్బే వంద కేజీలు ఉంటుంది అని పొగుడుతుంది పారిజాతం. జంతు సంరక్షణ వాళ్లు వలేసి పట్టుకోగోలరు. అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉంటాయి. ఇక్కడ నా భార్య పని మనిషి. జ్యోత్స్న కూడా ఇలాగే ఇదివరకు తాళి తెంపిందా అని కార్తీక్ అంటాడు.

దానికి దీప విజిల్ కొట్టి. ఏం అడిగావ్ బావ. లా చదివి ఉంటే లాయర్ అయ్యేవాడివి అని పారుకు కౌంటర్ ఇస్తుంది దీప. పెళ్లి చేసుకోమని దీప అంటుంటే చేయి అలా తగిలి తెగింది. దానికి పాత అకౌంట్స్ చాలా ఉన్నాయని పారు అంటుంది. అంటే నీ మనవరాలికి మంచి చెబితే నచ్చదు. కావాలనే కోపంతో, పగతో తాళి తెంపింది. పొరపాటున తెగితే సారీతో సరిపోతుంది. కావాలని చేస్తే ఇలాగే చేయాల్సి వస్తుంది అని కార్తీక్ అంటాడు.

జ్యోత్స్న ప్రశ్నలు

నువ్ అనుకుంది జరగదు బావ అని జ్యోత్స్న అంటే.. ఆశ పడకు అని నువ్వేందుకు ఆవేశపడుతున్నావ్ అని కార్తీక్ అంటాడు. డ్రైవర్ గాడివి నువ్వేంట్రా అని పారిజాతం అంటే మరి డ్రైవర్‌తో మీకు మాటలేంటీ.. దీప వెళ్లు. పని లేకుంటే చాలు సోది మొదలుపెడతారు అని పారును అనేసి వెళ్లిపోతాడు కార్తీక్. శివ నారాయణకు దీప కాఫీ ఇస్తుంది.

మీ అత్తకు ఎలా ఉంది అని శివ నారాయణ అడిగితే.. మీ కూతురు బాగుంది అని దీప అంటుంది. కాంచన గురించి శివ నారాయణ మాట్లాడుతాడు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. కాంచన అచ్చం మా అమ్మలా ఉంటుంది. మేము పేదవాళ్లం. పెద్దయ్యాక మా అమ్మను బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ, అది కుదరలేదు. తర్వాత బిజినెస్ పెట్టి బాగా ఎదిగాం. మనసులో వెలితి. కానీ, కాంచనను చూసిన తర్వాత నా బెంగ పోయింది. నాకు తల్లి లేదు. నా కూతురుకు తల్లి లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శివ నారాయణ .

ఆ మాటలు కార్తీక్ వెంటాడు. ఎవరు బంధాలు తెంచుకుని పోరు పెద్దసారు. మన చుట్టు గాలి ఉన్నట్లే అంతా మనతోనే ఉంటారు. కానీ, మనం తలుపులు వేసుకున్నట్లు అవి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుందని కార్తీక్ అంటాడు. తాతకు దగ్గులు నేర్పకు అని శివ నారాయణ అంటాడు. సరే దీప అడగాల్సింది అడుగు అని కార్తీక్ అంటే.. సుమిత్రను పిలిచి వీడు గొంతెమ్మ కోరికలు అడుగుతున్నాడు అని పారిజాతం అంటుంది.

సుమిత్ర, దశరథ్ దీప తల్లిగా పెళ్లి చేయరు. ఇది అందరి మాట. నా మాటే అందరి మాట అని పారిజాతం అంటుంది. సరే ఎవరు కన్నీళ్లకు ఎవరు బాధ్యులు. ఇదే విషయం అమ్మకు చెబుతాం పదా దీప అని కార్తీక్ వెళ్లబోతుంటే శివ నారాయణ ఆపుతాడు. జరిగిందంతా గుర్తు చేసుకుని ఆలోచిస్తాడు. పెళ్లి జరుగుతుంది అని శివ నారాయణ అంటాడు.

పారు, కార్తీక్ మధ్య వాగ్వాదం

దాంతో అంతా షాక్ అయితే దీప సంతోషిస్తుంది. నువ్ కోరుకున్నట్లుగానే కూతురు స్థానంలో దీప, తల్లిదండ్రుల స్థానంలో సుమిత్ర, దశరథ్‌ల చేతుల మీదుగా ఈ పెళ్లి జరుగుతుంది అని శివ నారాయణ అంటాడు. మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని సంతోషంగా చెబుతాడు దశరథ్. దాంతో కోపంగా సుమిత్ర వెళ్లిపోతుంది. సుమిత్ర వెళ్లిపోయిందని పారు అంటే నాన్న మాటిచ్చాడు పిన్ని అని దశరథ్ అంటాడు.

పెద్దసారు మాటిచ్చాడు అంటే గవర్నమెంట్ స్టాంప్ పడినట్లే. థ్యాంక్యూ సర్. ఈ శుభవార్త మా అమ్మకు చెప్పాలి అని దీప, కార్తీక్ వెళ్లిపోతారు. పెద్దాయన ఒప్పుకుంది కాంచనకు, అనసూయకు చెబుతారు కార్తీక్, దీప. కార్తీక్‌ను అనసూయ తెగ పొగుడుతుంది. మన జీవితాల్లోకి కొత్త గాలి వచ్చినట్లుంది. అన్ని వింతలు జరుగుతున్నాయి అని కాంచన అంటుంది.

కాంచన గురించి పొగిడింది, కంటతడి పెట్టింది కార్తీక్, దీప చెబుతారు. ఇంతలో కార్తీక్‌కు ఫోన్ వస్తే ఫ్రెండ్ అని వెళ్లిపోతాడు. మా నాన్న నన్ను తలుచుకున్నారట. నాకు సంతోషంగా ఉందని కాంచన అంటుంది. బావకు ఈ టైమ్‌లో ఫోన్ చేసిన ఫ్రెండ్ ఎవరు అని దీప అనుమానిస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరకు శివనారాయణ తన కూతురు కోసం కన్నీరు పెట్టుకుంటాడు. జ్యోత్స్న ప్రశ్నలకు కార్తీక్ సమాధానాలతో ఎపిసోడ్ ముగుస్తుంది. కార్తీక్, దీపల జీవితంలో తదుపరి ఏమి జరుగుతుందో తెలియాలంటే తప్పకుండా తదుపరి ఎపిసోడ్ చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.