
కార్తీక దీపం 2 సీరియల్ లోని ఈరోజు ఎపిసోడ్ లో పెళ్లి ఆగిపోవడానికి సుమిత్ర తాళి తీసిందని ఒప్పుకుంటుంది. జ్యోత్స్న కుట్రలు, దీప బాధ, కుటుంబ సభ్యుల ప్రతిచర్యలు ఈ ఎపిసోడ్ లో ప్రధాన ఆకర్షణలు.
Key Points
సుమిత్ర తాళి తీసింది అని ఒప్పుకుంది!
పెళ్లి ఆపేందుకు జ్యోత్స్న కుట్ర పన్నిందా?
కార్తీక్, కాంచన ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి?
సుమిత్ర ఆశ్చర్యకరమైన ఒప్పుకోలు
కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో పెళ్లి ఆపాలనుకుంది ఎవరో నీ భర్తనే అడుగు చెప్తాడని దీపతో పారిజాతం అంటుంది. తాళి దాచింది ఎవరో మా బావకు తెలుసా? అని దీప అడిగితే.. తెలుసు అని పారు సమాధానం ఇస్తుంది. నాకు తెలియడం ఏంటీ పారు అని కార్తీక్ తడబడతాడు. అయితే తాళి తీసావని తెలుసు అత్త అని సుమిత్రతో మాట్లాడినప్పుడు పారిజాతం వింటుంది. ఇప్పుడు దశరథ సీరియస్ గా అడగ్గానే సుమిత్ర అని నిజం చెప్పేస్తుంది పారిజాతం. అందరూ షాక్ అవుతారు.
ఎవరి మీద ఎలాంటి నిందలు వేయాలో తెలియదా? అని పారును దీప అంటుంది. వదిన దేవతమ్మా, దేవత మీద నింద వేశావా? అని దాసు అంటాడు. పెద్దమ్మ తప్పు చేసిందంటే నేను చచ్చినా నమ్మను అని కాశీ చెప్తాడు. పారిజాతం ఇది అబద్ధమని చెప్పండని దీప అడుగుతుంది. కానీ కార్తీక్ తో తల్లి కాంచన మీద ఒట్టు వేయించి తాళి తీసింది ఎవరు? అని అడుగుతుంది పారు. చెప్పలేడు, ఎందుకంటే అదే నిజం అని సుమిత్ర బయటపడుతుంది.
తాళి తీసింది నేనే అని సుమిత్ర అనగానే అందరూ షాక్ అవుతారు. ఈ పెళ్లి ఆపాలనే తాళి తీశానని సుమిత్ర అంటుంది. నేను నమ్మను, లేని నిందను నీ మీద వేసుకుంటున్నావని కాంచన అంటుంది. దీప పెళ్లి జరగడం ఇష్టం లేక నేనే ఆ తాళి తీశానని సుమిత్ర మరోసారి స్పష్టం చేస్తుంది. అంటే సందర్భాన్ని బట్టి పగలు బయటపడతాయి. నీకు దీప అంటే ఇష్టం లేదు కాబట్టి పెళ్లి ఆపాలనుకున్నావా? ఎందుకు వదిన ఇంత ద్వేషాన్ని దాచుకున్నావు? ఆవు పొదుగులో నుంచి పాలు వస్తాయనే తెలుసు, కానీ విషాన్ని పిండి చూపిస్తున్నారు. అన్నయ్య నీకు తెలియకుండా వదిన ఇలాంటి నిర్ణయం తీసుకోదు. నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదా అన్నయ్య అని కాంచన బాధ పడుతుంది.
జ్యోత్స్న యొక్క కుట్ర
ముందే చెప్పొచ్చు కదా నాన్న. నీ కొడుకు కోరికను వెనక్కి తీసుకోమని చెప్పి ఉండాల్సింది నాన్న అని కాంచన అంటే.. పెళ్లి ఆగిపోవాలని అనుకునేవాణ్ని అయితే నీ కన్నతల్లి తాళి కోడలికి ఎలా ఇస్తానమ్మా? అని తిరిగి ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. ఈ పాపంలో నీకు భాగం లేదు నాన్న అని కాంచన అంటుంది. తాళి నేనే తీశా. దీనికి ఎవరికి సంబంధం లేదు. నీ కోడలు నా శత్రువు. నా కంఠంలో ఊపిరి ఉండగా నేను ఈ మనిషిని క్షమించలేను అని చెప్పేసి సుమిత్ర వెళ్లిపోతుంది. భార్య చేసిన తప్పును గుండెల్లో దాచుకుని చెల్లెని ఓదార్చలేవు. నిన్ను కూడా నమ్మలేను అన్నయ్య అని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏడుస్తూ కూలబడిపోతుంది దీప.
రాత్రి శివన్నారాయణ ఇంట్లో పారు, జ్యోత్స్న సెలబ్రేట్ చేసుకుంటారు. పారిజాతం దెబ్బకు అందరూ షాక్ అయ్యారని పారు గొప్పగా చెప్పుకుంటుంది. సుమిత్ర తాళి దొంగతనం చేసిందని కార్తీక్ అడగడం, నేను వినడం అన్ని మన మంచికే జరిగాయి. కలిసి పోతాయనుకున్న ఈ రెండు కుటుంబాలను కొట్టుకు చచ్చేలా చేశామని పారు అంటుంది. మా మమ్మీ చేత దొంగతనం చేయించింది నేను అని బాంబ్ పేలుస్తుంది జ్యోత్స్న. మంగళసూత్రమే లేకపోతే, ఈ పెళ్లి నువ్వే ఆపాలని సుమిత్రను ఎలా రెచ్చగొట్టానన్నది జ్యో చెప్తుంది. సుమిత్రతో ఒట్టు వేయించుకుంటుంది జ్యోత్స్న.
మమ్మీ తాళి దొంగతనం చేయడం బావ చూశాడని నాకు తెలుసు. మా బావ, మమ్మీ మాట్లాడిన దగ్గరకీ నిన్ను పంపించింది నేనే. ఓ సారి గుర్తు చేసుకో. మమ్మీ, బావ మాట్లాడుకున్న మాటలు నేను విన్నానని వాళ్లకు తెలియదు. నేను చూస్తున్నానని నీకు తెలియదు. ఆ రోజు నీ వెనుకే ఉన్నానని జ్యోత్స్న చెప్పడంతో తల తిరుగుతుందని సోఫాలో పడిపోతుంది పారు. నాకు కావాల్సింది పెళ్లి ఆగడం, నింద నా మీద పడటం కాదు అని జ్యో అంటుంది.
దీప యొక్క బాధ
పెళ్లి ఆపడానికి మమ్మీని వాడుకున్నా. కుటుంబాన్ని విడగొట్టడానికి నిన్ను వాడుకున్నా అని జ్యోత్స్న అంటుంది. ఈ రేంజ్ మైండ్ గేమ్ తట్టుకోవడం కష్టమే. ఇన్ని చేసి ఏం తెలియనట్లు ఏం నటించావే అని పారు అంటుంది. ఇంట్లో ఏదో ఒకటి చేసి గొడవ చేయమని పారుకు చెప్తుంది జ్యో. పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని బాధపడేలా చేస్తా దీప అని జ్యోత్స్న అనుకుంటుంది.
మనిషికి అతిపెద్ద శత్రువు మంచితనం. మనసుతో చేసే తప్పుల కంటే మంచితనంతో చేసే తప్పులకే మనిషి ఎక్కువ బాధపడతాడు. మనిషిని నమ్మడమే నేను చేసిన తప్పు. భర్త చేతిలో మోసపోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు వదిన మోసం చేసినప్పుడు అంతే బాధపడ్డా. వాళ్లనేమైనా ఆస్తులు అడిగానా? పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే ముహూర్తం పెట్టించడం దేనికీ, తాళి దాచడం దేనికీ? మా వదిన ఎంత పగ పెట్టుకుంది? నువ్వు కూడా నన్ను మోసం చేశావు. నువ్వు నిజం చెప్పవా? అని కార్తీక్ తో అంటుంది కాంచన.
ఇంటి పరువు కోసం మౌనంగా ఉన్నానని కార్తీక్ అంటాడు. మా నాన్న పరువు పోయి ఉండేది కదా అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సుమిత్ర చేసిన కార్యం అందరినీ కలచివేస్తుంది. దీప బాధ, కార్తీక్, కాంచన ప్రతిస్పందనలు కథను ఆసక్తికరంగా మార్చాయి. మరిన్ని ఉత్కంఠభరిత ఘట్టాల కోసం వేచి చూద్దాం.


