|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చూసి కూడా ఎందుకు ఆప‌లేద‌ని జ్యోకు షాకిచ్చిన సుమిత్ర‌-శివ‌న్నారాయ‌ణ సీరియ‌స్‌-దీపపై ప్రేమ

Published: 03-11-2025, 12:02 AM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చూసి కూడా ఎందుకు ఆప‌లేద‌ని జ్యోకు షాకిచ్చిన సుమిత్ర‌-శివ‌న్నారాయ‌ణ సీరియ‌స్‌-దీపపై ప్రేమ

కార్తీక దీపం 2 నవంబర్ 3 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. పెళ్లి రోజు వేడుకల్లో దశరథ దీపకు కేక్ తినిపించగా, జ్యోత్స్నపై శివన్నారాయణ సీరియస్ అయ్యారు. సుమిత్ర తన కూతురికి షాకిస్తూ ఆమె అమాయకత్వాన్ని బయటపెట్టింది. ఈ కుటుంబ పోరులో కొత్త మలుపులు చోటుచేసుకున్నాయి.

Key Points

1

కార్తీక్ పెళ్లి రోజున దీపకు కేక్ తినిపించిన దశరథ.

2

కాంచన, శ్రీధర్ విషయంపై జ్యోత్స్న రచ్చ చేయబోతే శివన్నారాయణ సీరియస్.

4

జ్యోత్స్న చర్యల వల్లే కుటుంబంలో సమస్యలు వచ్చాయని సుమిత్ర వెల్లడి.

జ్యోత్స్నకు సుమిత్ర షాక్

కార్తీక దీపం 2 టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో పెళ్లి రోజు సందర్భంగా సుమిత్ర, దశరథతో దండలు మార్పిస్తాడు కార్తీక్. జ్యోత్స్నకు కాకుండా దీపకు కేక్ తినిపిస్తాడు దశరథ. కాంచన, శ్రీధర్ కలిసి ఉండటం లేదనే విషయంతో రచ్చ చేయాలని చూస్తుంది జ్యో. శివన్నారాయణ  సీరియస్ అవుతాడు. కూతురికి సుమిత్ర షాకిస్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే నవంబర్ 3 ఎపిసోడ్ లో అమ్మలాంటి అత్తకు ఎంతో రుణపడి పోయా. ఆ రుణాన్ని ఎంతో కొంత తీర్చుకోగలిగితే చాలని కార్తీక్ అంటాడు. మనవడికే కాదు మనవరాలికి కూడా చాలా చెప్పా. ఎవరికి ఏం అవసరమో అది మాత్రమే గుర్తు పెట్టుకుంటారని శివన్నారాయణ అంటాడు. అందరు కలిసి జోకర్ ను చేశారు. బావకు, దీపకు ఎక్కడ నిజం తెలిసిపోయిందోననే కొత్త భయం పట్టుకుందని జ్యోత్స్న అనుకుంటుంది.

శివన్నారాయణ ఆగ్రహం

బావ, నువ్వు నీ కన్నతల్లిని పట్టించుకోవు. కానీ నా కన్నతల్లి కాపురాన్ని నిలబెట్టేందుకు మాత్రం యుద్ధాలు చేస్తావు. మీ అమ్మానాన్నకలిసి ఉండాలని కోరుకోవా? అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు అడిగిన దాంట్లో తప్పు లేదు. కానీ అజ్ణానం ఉంది. మాట్లాడేటప్పుడు బుర్ర కాదు బుద్ధి కూడా పనిచేయాలి. వాళ్లు విడిపోయారని ఎవరైనా చెప్పారా? విడిపోయారని ఎలా అంటున్నావ్? కార్తీక్ పెళ్లికి శ్రీధర్ ఒంటరిగా వచ్చాడా? ఇప్పుడు జంటగానే ఉన్నారా? కళ్లు కనిపించడం లేదా? నోటికి ఏదొస్తే అదే అంటావా? అని జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ.

గతాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతుంది జ్యోత్స్న. నేను బాధపడటానికి కారణం దీపే అంటావు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం దీపే అంటావు. అవును.. అని జ్యోత్స్న అంటుంది. బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత ఇంట్లో గొడవ జరిగింది. దానికి కారణం ఎవరు? అని అడుగుతుంది సుమిత్ర. ఆ రోజు నువ్వు చేసిన పనికి రిజల్ట్ అలాగే వచ్చింది. నీకు ఏం తెలీదు జ్యోత్స్న. నువ్వెంత అమాయకురాలివి అంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూసినా ఆపలేనంత. మీ డాడీకి, నాకు గొడవ రావడానికి కారణం నువ్వే అని తెలిసినా దీపను తప్పుపట్టేంత అమాయకురాలివని సుమిత్ర షాక్ ఇస్తుంది.

దీప-కార్తీక్ బంధం

బావ, దీప కలిసి నీ మనసు మార్చేశారు మమ్మీ అని జ్యోత్స్న కంగారు పడుతుంది. నేను నిన్నేం అడగడం లేదు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పా అంతే. నువ్వేంటో నాకు తెెలీదా? అని వెళ్లిపోతుంది సుమిత్ర. షాక్ గట్టిగానే తగిలినట్లుందని అంతా విన్న అంటూ పారిజాతం వస్తుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసిపోయే రోజు చాలా దగ్గర్లో ఉంది. బిడ్డలను మార్చింది నేనే కాబట్టి గెంటేస్తుండొచ్చు. నిన్ను ఏం చేస్తారో తెలియదని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మొత్తానికి కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ కుటుంబ బంధాలు, రహస్యాలతో నిండిపోయింది. జ్యోత్స్న చేసిన తప్పులు, దీప పాత్ర, కార్తీక్ ప్రేమ కథ మరింత ఆసక్తిని రేకెత్తించాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.