
కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో జ్యోత్స్న ప్లాన్ బెడిసికొట్టగా, కార్తీక్ వేలంపాటకు చేరుకున్నాడు. దశరథ్ శత్రువు వైరా ఎంట్రీ, జ్యోత్స్న ఛాలెంజ్ కథకు కొత్త మలుపునిచ్చాయి. దీప తన భర్త కార్తీక్ గెలుస్తాడని నమ్ముతోంది. ఈ హై డ్రామా అభిమానులను ఉత్కంఠగా చూసేలా చేసింది.
Key Points
జ్యోత్స్న వేలంపాట నుంచి కార్తీక్‌ను దూరం చేయాలని ప్రయత్నించింది.
కార్తీక్ ఆ వేలంపాటకు హాజరవడంతో జ్యోత్స్న ప్లాన్ బెడిసికొట్టింది.
దశరథ్ పాత శత్రువు వైరా అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు.
దీప కార్తీక్‌పై నమ్మకంతో మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
జ్యోత్స్న వేలంపాట ప్లాన్ బెడిసికొట్టిందా?
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఈ వేలం పాట తర్వాత నీ మనవరాలి జాతకమే మారబోతుంది అని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ ఒక్కడిని కంట్రోల్ చేయగలితే చాలు అని పారు అంటే.. అందుకే బావను వేలంపాటకు రాకుండా చేశాను అని జ్యో అంటుంది.
శివ నారాయణ వచ్చి వేలంపాటకు వెళ్దామంటాడు. ఇంతలో కార్తీక్, దీప వస్తారు. సుమిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానంటుంది జ్యోత్స్న. ఒకరు గెలుస్తానంటే ఓడించేందుకు చాలా మంది ట్రై చేస్తుంటారు. నీలాంటి తల్లి ఉంటే అన్ని సాధిస్తా అని కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. కార్తీక్ బయలుదేరుదాం పదా అని శివ నారాయణ అంటాడు.
డ్రైవర్ అవసరం లేదు. నేను కారు డ్రైవ్ చేస్తానంటుంది జ్యో. నువ్వు డ్రైవ్ చేయి అయినా కార్తీక్ వస్తాడు. వాడు మన మనిషిగా వస్తాడు. కొన్నిసార్లు మనకంటే చిన్న వాళ్ల సలహాలు కూడా మెడిసిన్‌లా పనిచేస్తాయని దశరథ అంటాడు. శివ నారాయణ కూడా సపోర్ట్ చేస్తాడు. వీళ్లనెప్పుడు మార్చావ్ బావ అని జ్యో అనుకుంటే.. వీడు పెద్ద మాయగాడు అని పారు అనుకుంటుంది.
సుమిత్రను ఎదురురమ్మని శివ నారాయణ అని అందరూ వెళ్తారు. అలా జ్యోత్స్న ప్లాన్ బెడిసికొడుతుంది. కార్తీక్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతుంది దీప. ఇది బాగా మురిసిపోతుంది. అదేంటో కనుక్కోవాలి అని దీపతో కిచెన్‌లో మాటలు కలుపుతుంది పారు. దీప వెటకారంగా మాట్లాడుతుంది. జ్యోత్స్న వేలంపాటలో గెలుస్తుందా లేదా అంటే నాకు తెలియదు అని దీప అంటుంది.
మా బావ వెళ్తే అక్కడ మంచి జరుగుతుందని నమ్మకం అని దీప అంటుంది. కార్తీక్ గాడిని సీఈవో చేయాలని దశరథని కాకా పడుతున్నావని నాకు తెలుసు. నా మనవరాలు గెలిచి వస్తుంది. ఎర్రటి నీళ్లతో దిష్టి తీసేందుకు రెడీగా ఉండని పారిజాతం అంటుంది. ఎప్పుడైనా సరే నేను మంచే జరగాలని కోరుకునే మనిషిని, మంచే జరుగుతుంది అని దీప అంటుంది.
కార్తీక్, దీపల వ్యూహం ఏంటి?
వేలంపాట జరిగే ప్లేసుకు శివ నారాయణ వాళ్లు వెళ్తారు. కార్తీక్‌ను ఆపి మాట్లాడాలన్న జ్యోత్స్న ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతుంది. నాతో అని చెప్పి ఫోన్‌లో మాట్లాడుతుంది ఏంటీ. నేను క్రెడిట్ తీసుకుంటానని భయపడుతున్నట్లుంది. పోటీ లేని హోటల్‌కు కాంపిటేషన్ ఎవరు వస్తారులే అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలో వైరా వస్తాడు. అది దశరథ చెప్పడంతో శివ నారాయణకు కోపంగా చూస్తాడు.
వైరా వచ్చి నమస్కారం పెడితే.. నమ్మించి మోసం చేసినవాళ్లు ఎదురుపడి నమస్కారం పెడితే అవి సంస్కారాలు లేని మర్యాదలుగా మిగిలిపోతాయ్. కొంతమందికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని శివ నారాయణ వెళ్లిపోతాడు. బిజినెస్‌లో మనిద్దరికి పార్టనర్‌షిప్ పడక విడిపోయాం అని వైరా అంటే.. కుదరక కాదు నీ మోసం బయటపడి. దాంతో మన స్నేహం పదేళ్లకిందటే చచ్చిపోయిందని దశరథ్ అంటాడు.
ఈ పదేళ్లలో నీ బిజినెస్ గురించి వింటూనే ఉన్నా. హవాలా, మోసం, డ్రగ్స్, దుబాయ్‌లో రెస్టారెంట్ క్లోజ్ చేసుకుని ఇక్కడికి వచ్చావ్. శత్రువుల గురించి తెలుసుకోవడం మంచిదే అని దశరథ్ అంటాడు. నీ బిజినెస్‌ను మీ అమ్మాయికి అప్పగించినట్లున్నావ్. ఓడిపోడానికి రెడీగా ఉండని వైరా అంటే.. అది కర్మ నిర్ణయిస్తుందని దశరథ్ అంటాడు.
కార్తీక్‌తో జ్యోత్స్న మాట్లాడుతుంది. ఈరోజు నన్ను చూసి అందరూ భయపడేలా చేస్తా అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నతో వైరా మాట్లాడుతాడు. పెద్ద మేడమ్ గారు లోపల మనకోసం వెయిట్ చేస్తుంటారు అని కార్తీక్ అంటే.. నువ్వెళ్లు నేను వస్తానని జ్యోత్స్న అంటుంది. ఎవరతను ఎక్కడో చూసినట్టుందని వైరా అంటే.. మీరు వచ్చింది ఎవరి కోసం అని జ్యో అంటుంది.
మీకోసమే. పదేళ్ల క్రితమే నేను రెస్టారెంట్ బిజినెస్‌లోనే ఉన్నాను. కానీ, ఆపేశాను. మళ్లీ స్టార్ట్ చేశాను. మీకు ఓటమి అలవాటేగా. సారీ. కానీ ఇది నిజం. మీ బిజినెస్ నష్టాల్లో పడటానికి మీరే కారణమట. మీ బిజినెస్‌లు నేను టేకప్ చేస్తాను. కావాలంటే లీజ్‌కు తీసుకుంటా. నేను తుఫాన్ లాంటోన్ని దేన్నైనా కదిపేస్తా అని వైరా ఛాలెంజ్ చేస్తాడు. తుఫాన్‌కి చెట్లు కదులుతాయేమో పర్వతాలు కాదు అని జ్యోత్స్నడైలాగ్ కొడుతుంది.
దశరథ్ శత్రువు వైరా ఆగమనం
అది విన్న కార్తీక్ అబ్బబ్బా ఏం డైలాగ్ చెప్పావ్ మరదలా. వీడెవడో మా పారుకంటే దరిద్రంగా ఉన్నాడు. మాట్లాడించి మరి పంచ్‌లు వేసుకుంటున్నాడు అనుకుంటాడు. నువ్వే ఓడిపోయేందుకు రెడీగా ఉండు అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. వేలంపాటలో కార్తీక్‌తోపాటు శివ నారాయణ అంతా కూర్చుంటారు. వైరా గురించి దశరథ్‌ను కార్తీక్ అడుగుతాడు.
వాడి గురించి తర్వాత చెబుతానని దశరథ్ అంటాడు. జ్యోత్స్న ఎక్కువగా పాడకు. నేను చెప్పినప్పుడు ఆపు అని శివ నారాయణ అంటాడు. ఓకే తాతా అని చెప్పిన జ్యోత్స్న ఛ.. బావ నన్ను డమ్మీని చేయడానికి డాడీని, తాతను కంట్రోల్‌లో పెట్టుకున్నాడు అనుకుంటుంది. ఆ వైరా అంకుల్ ముందు ఓడిపోయేలా చేస్తున్నారు. వీళ్లను ఇక్కడి నుంచి పంపించేయాలని అని ఎవరికో కాల్ చేస్తుంది జ్యోత్స్న.
తర్వాత దశరథ్‌కు కాల్ వస్తుంది. దాంతో షాక్ అవుతాడు దశరథ్. మన రెస్టారెంట్ మీద ఫుడ్ సెక్యురిటీ వాళ్లు రైడ్ చేశారట. ఎవరో కావాలనే చేశారు. వాళ్ల సంగతి తర్వాత చెబుతా. డాడీ మనం వెళ్దాం పదా అని దశరథ్ అంటాడు. కార్తీక్ పదా. ఇప్పుడున్న టెన్షన్‌లో వీడు డ్రైవింగ్ చేయలేడు. నాకు డ్రైవింగ్ రాదు అని శివ నారాయణ అంటాడు. దాంతో కార్తీక్ కూడా వెళ్తాడు.
ఇది వీడి పనే అయింటుంది అని వైరాను అనుకుంటాడు దశరథ్. నేను అనుకుంది సాధించడానికి ఎంతదూరమైన వెళ్తాను బావ అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. మరోవైపు సుమిత్రకు దీప కాఫీ ఇస్తుంది. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది. నా కూతురుతో కలిసి తినాలని ఉంది. కూరగాయలన్నీ వేసి సాంబారు పెట్టు అని సంతోషంగా చెబుతుంది సుమిత్ర.
తర్వాత టిఫిన్ చేశావా అని సుమిత్ర అడిగితే దీప చేశానంటుంది. నిజం చెప్పమని సుమిత్ర అంటే.. మీకు అబద్ధం చెబుతానా అని దీప అంటుంది. అది నీకు అలవాటే కదా. అబద్ధాలు చెప్పి చెప్పి నీకు అదే జీవితం అయిపోయింది అని సుమిత్ర షాక్ ఇవ్వడంతో దీప నొచ్చుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
వేలంపాటలో జ్యోత్స్న గెలుస్తుందా, లేక కార్తీక్ విజయం సాధిస్తాడా అనేది ఉత్కంఠగా మారింది. వైరా ఎంట్రీతో కథ మరింత ఆసక్తికరంగా మారనుంది. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.


