
📌 Key Points
- కార్తీ ‘అన్నగారు వస్తారు’ చిత్రంతో డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
- ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ‘ఖైదీ 2’ అప్‌డేట్ గురించి కార్తీని అడిగారు.
- ‘ఖైదీ 2’ గురించి అడగ్గానే కార్తీ సరైన సమాధానం చెప్పకుండా దాటవేశాడు.
- లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ‘ఖైదీ 2’ రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
కార్తీ నటించిన ‘అన్నగారు వస్తారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ‘ఖైదీ 2’ పై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ సినిమా అప్‌డేట్ గురించి అడగ్గానే కార్తీ సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కార్తీ కొత్త చిత్రం ‘అన్నగారు వస్తారు’
Karthi : హీరో కార్తీక్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మామూలుగా తమిళ్ ప్రేక్షకులు కంటే కూడా తనకు తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ఇష్టం అని చెబుతూ ఉంటాడు కార్తీ. అలానే తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ ను చూస్తే ఒక తమిళ్ హీరో అనే ఫీల్ క్రియేట్ అవ్వదు. కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద అతను చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ పర్ఫార్మర్ గా మాత్రం అతను ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సత్యం సుందరం సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.
ఇక ప్రస్తుతం అన్నగారు వస్తారు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు కార్తీ. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు నిర్వహించింది. ఈ ఈవెంట్ కు దర్శకులు దేవకట్ట, బాబి, శైలేష్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నగరం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా చూపించి దర్శకుడుగా అద్భుతమైన మార్కులు సాధించుకున్నాడు.
‘ఖైదీ 2’ పై కార్తీ స్పందన
ఖైదీ సినిమా తర్వాత లోకేష్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పటికీ కూడా చాలామంది ఖైదీ ఏ లోకేష్ బెస్ట్ వర్క్ అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చిన మాస్టర్, విక్రమ్ సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ సాధించాయి.
ఎక్కడో హాలీవుడ్ లో ఉండే కల్చర్ ను ఇండియన్ సినిమాకి పరిచయం చేశాడు. ఇప్పటికీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటేనే ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఇందులో భాగంగా ఖైదీ 2 సినిమా రాబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. అయితే దాని అప్డేట్ గురించి నేడు జరిగిన ఈవెంట్ లో అడిగితే కార్తీ సరైన సమాధానం చెప్పకుండా వస్తుంది వస్తుంది అని దాటిపోయారు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ‘ఖైదీ’ ప్రత్యేకత
అయితే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి స్టేజ్ పైన మాట్లాడారు. ఒకప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సినిమాల్లోనూ అలానే రాజకీయాల్లోనూ ఎంతో సేవ చేశారు. వాస్తవానికి వాళ్లు సక్సెస్ అయిన విధానం చాలామందికి ఆదర్శం. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అంటూ కార్తీ సినిమా గురించి చెప్పాడు.
‘ఖైదీ 2’ పై కార్తీ స్పందన సినిమా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో, కార్తీ ఏమి చెబుతాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి కార్తీ ‘అన్నగారు వస్తారు’ పై దృష్టి సారించాడు.


