|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kaushal Manda: అలాగైతే 500 సినిమాలు చేసేవాడిని.. ఆ హీరోతో నటించాలని కోరిక..

Published: 13-06-2025, 9:39 AM
Kaushal Manda: అలాగైతే 500 సినిమాలు చేసేవాడిని.. ఆ హీరోతో నటించాలని కోరిక..

తెలుగు బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన కౌశల్ మండా, తన సినీ ప్రయాణం, 98 సినిమాల అనుభవం, మరియు తనకున్న ఆకాంక్షల గురించి తాజాగా మాట్లాడారు. ఉదయ్ కిరణ్ తో అతనికి ఉన్న అనుబంధం గురించి కూడా ఆయన పేర్కొన్నారు.

కౌశల్ మండా సినీ ప్రయాణం

తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే కౌశల్‌ మండా ( Kaushal Manda ) ఒక సంచలనం. ఇతడు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో అడుగుపెట్టినప్పుడు అభిమానులు కౌశల్‌ ఆర్మీ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, రోడ్డుపై ర్యాలీలు కూడా చేశారు. ఏదైతేనేం.. రెండో సీజన్‌ కప్పు కొట్టడంతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెల్చుకున్నాడు.

500 సినిమాలు చేసేవాడిని షోలు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. కౌశల్‌ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులో రాజకుమారుడు మూవీతో సినీప్రయాణం ప్రారంభించాను. అప్పటినుంచి దాదాపు 98 సినిమాల్లో యాక్ట్‌ చేశాను. అందరూ కేవలం ఒకే వృత్తిపైనే ఫోకస్‌ పెడతారు. కానీ, నేను మల్టీ టాస్కింగ్‌ చేస్తాను. మోడలింగ్‌, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ కొరియోగ్రఫీ.. ఇవన్నీ చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నాను. ఇవేవీ లేకుంటే ఈపాటికి 500 సినిమాలు అయిపోయేవి.

ఉదయ్ కిరణ్ తో అనుబంధం

ఆ హీరోలతో పని చేయాలనుంది హీరో ఉదయ్‌కిరణ్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అతడు సుమారు 16 సినిమాలు చేసుంటే అందులో 12 చిత్రాల్లో నేనూ యాక్ట్‌ చేశాను. తనతో నాకు మంచి అనుబంధం ఉండేది. చిరంజీవి, కమల్‌ హాసన్‌ గారితో కలిసి పని చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా ఆ ఛాన్స్‌ వస్తే బాగుండని ఎదురుచూస్తున్నాను. ఇకపోతే మా అమ్మ క్యాన్సర్‌తో పోరాడుతూ చనిపోయింది. అందుకే బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీని క్యాన్సర్‌ బాధితులకే విరాళమిస్తానని ప్రకటించాను. ఆ మాట నిలబెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు.

భవిష్యత్తు ఆకాంక్షలు

కౌశల్ మండా తన బహుముఖ ప్రజ్ఞతో సినిమా రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి, కమల్ హాసన్ లాంటి స్టార్స్ తో నటించాలనే ఆయన కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.