
📌 Key Points
- కీరవాణి కొడుకు కాల భైరవ, నటి కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లి వార్తలు వైరల్.
- బుక్ లాంచ్ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో పుకార్లు ఊపందుకున్నాయి.
- కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకరించాయని కొన్ని వర్గాల సమాచారం.
- త్వరలోనే నిశ్చితార్థం లేదా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం.
టాలీవుడ్‌లో మరో ప్రేమ జంట వార్తల్లో నిలిచింది. నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒక కార్యక్రమంలో కనిపించడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.
వైరల్ అవుతున్న పెళ్లి వార్తలు
Kavya Kalyanram: టాలీవుడ్‌లో ఒక ప్రేమ కథ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. కీరవాణి కొడుకు.. కాల భైరవ.. బలగం సినిమాతో నప్పించిన నటి కావ్య కళ్యాణ్ రామ్ గురించి పెళ్లి వార్తలు.. గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమ ఇటీవల ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలు మరింతగా ప్రచారం అవుతున్నాయి. ఒకే వేదికపై కలిసి కనిపించడం అభిమానుల్లో కొత్త ఆసక్తిని పెంచింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ ఉంది.
అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి కాల భైరవ గానీ, కావ్య కళ్యాణ్ రామ్ గానీ అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయినప్పటికీ, వీరి కుటుంబాలు ఈ సంబంధానికి ఓకే చెప్పినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ వార్తలు నిజమా కాదా అనే చర్చ సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తోంది.
కావ్య కళ్యాణ్ రామ్ చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం, ఇప్పుడు హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకుంది. ‘బలగం’, ‘మసూదా’ వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సహజంగా నటించడం ఆమె ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
Music Director #KalaBhairava and Actress #KavyaKalyanram at a book launch event ! pic.twitter.com/SZ8aZy3uug
బుక్ లాంచ్ ఈవెంట్లో కలిసి కనిపించిన జంట
— Rajesh Manne (@rajeshmanne1) March 24, 2026
మరోవైపు కాల భైరవ సంగీత రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అతని గాత్రం చాలా ప్రత్యేకంగా ఉండటం వల్ల యువతలో మంచి ఆదరణ పొందాడు. పలు సినిమాల్లో పాటలు పాడి, సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
వీరిద్దరూ చాలా కాలంగా ఒకరికొకరు పరిచయం ఉన్నారని చెబుతున్నారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి..తరువాత మరింత బలమైన బంధంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా పెళ్లి గురించి ఊహాగానాలు మరింత పెరిగాయి.
త్వరలో అధికారిక ప్రకటన?
ఇకపోతే, పెళ్లి ఏర్పాట్లు నిశ్శబ్దంగా జరుగుతున్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే నిశ్చితార్థం లేదా అధికారిక ప్రకటన రావచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే వారు స్వయంగా చెప్పే వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే..కావ్య కళ్యాణ్ రామ్ తన సినిమా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టింది. కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. వ్యక్తిగత జీవితం మరియు కెరీర్ రెండింటినీ సమతుల్యంగా కొనసాగించాలని ఆమె భావిస్తోంది.
కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవల పెళ్లి వార్తలపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వారిద్దరూ తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో ముందుకు సాగాలని ఆశిద్దాం.


