|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డేటింగ్ లైఫ్‌పై కావ్య కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు! ‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్ వైరల్!

Published: 16-02-2026, 1:35 PM
డేటింగ్ లైఫ్‌పై కావ్య కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు! 'వాట్స్ అప్ నరేష్' గ్లింప్స్ వైరల్!
  • కావ్య కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’లో నటిస్తున్నారు.
  • ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
  • వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది.
  • గ్లింప్స్‌లో డేటింగ్, కులం గురించి ఆసక్తికర సంభాషణలు ఉన్నాయి.

కావ్య కళ్యాణ్ రామ్ ‘వాట్స్ అప్ నరేష్’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో డేటింగ్ లైఫ్‌పై ఆమె చెప్పిన డైలాగ్ వైరల్ అయింది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

‘వాట్స్ అప్ నరేష్’ మూవీ గ్లింప్స్ విడుదల

Kavya Kalyanram: ఏంటి నిజంగానే కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) డేటింగ్ లైఫ్‌లో ఉందని అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఎక్కడో కాలేసినట్టే. ‘బలగం’, ‘మసూద’ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న కావ్యకు ఈ మధ్యకాలంలో అంతగా కలిసి రావడం లేదు. మంచి చిత్రాల కోసం, కథల కోసం చూస్తూ.. చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె చేస్తున్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’ (What’s Up Naresh). ‘కొత్తపోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ (Anvesh Michael) హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. సివివి సినిమా బ్యానర్‌పై భాగ్యలక్ష్మీ చింత నిర్మిస్తున్నారు. సివి విశాల్ (CV Vishal) దర్శకత్వంలో యూత్ ఫుల్, లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా వాలెంటైన్స్ డే‌‌ని పురస్కరించుకుని వదిలిన రెండో గ్లింప్స్‌ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న డైలాగ్‌తో కావ్యపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే..

డేటింగ్ లైఫ్‌పై కావ్య కళ్యాణ్ రామ్ కామెంట్స్

‘ఎట్ల నడుస్తుంది డేటింగ్ లైఫ్’ అని హీరో అడగడంతో.. ‘మొన్ననే చెప్పిన కదా నాకు ఇష్టం లేదని’.. అని హీరోయిన్ చెబుతున్న డైలాగ్‌తో ఈ గ్లింప్స్‌ ప్రారంభమైంది. ‘నువ్వెప్పుడూ డేట్స్‌కి వెళ్లడం లేదా?’.. అని హీరోయిన్.. ‘వెళ్లినా సెట్ అవ్వడం లేదు’ అని హీరో.., ‘ఏ.. ఏ..’ అని హీరోయిన్ అడగడంతో.. వారిద్దరి సంభాషణ మరింత ఇంట్రెస్టింగ్‌‌గా మారింది. ఇక చివరకు ‘మీ ఇంట్లో కాస్ట్ పిచ్చి ఏమైనా ఉందా?’.. అంటూ కులం గురించి మాట్లాడుకున్న డైలాగ్ అయితే మాములుగా లేదు. అలా మొత్తానికి ఈ రెండో గ్లింప్స్‌తో ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ గ్లింప్స్ లెంగ్త్ కాస్త ఎక్కువగా ఉన్నా కూడా.. ఇంకాస్త చూడాలనిపించేలా ఉందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. ముఖ్యంగా యూత్‌కు ఆ ఫీల్‌ని ఎక్కడా మిస్ కానివ్వలేదు. బ్యాక్ గ్రౌండ్‌లో ‘అయోమయంగా సాగుతున్న పయనమే ఇదా’ అనే పాట ఈ గ్లింప్స్ మంచి వైబ్ ఇస్తోంది. టోటల్‌గా ఈ గ్లింప్స్ ఏం టార్గెట్ చేసుకుని వచ్చిందో, ఈ తేదీన వచ్చిందో.. దానికి చక్కగా న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు.

యూత్‌ను ఆకట్టుకుంటున్న డైలాగ్స్

అంతా న్యాచురల్‌గా ఈ గ్లింప్స్‌ని కట్ చేయడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇందుతో కాస్ట్‌కి వారు చెప్పుకున్న అర్థం మాత్రం హైలెట్ అని చెప్పాలి. ఐటీ నుంచి ఫొటోషాప్ అనే కులంలోకి అని హీరోయిన్ అంటే, హీరో నాలుగైదు రకాల కులాలు చెప్పడం.. దర్శకుడి ప్రతిభను తెలియజేస్తుంది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. అంత డిస్కషన్ తర్వాత ఇద్దరూ కలిసి తిరగడం, బీచ్‌లకు షాపింగ్‌లకు వెళ్లడం, హీరోయిన్ మనసులో ఏదో ఉన్నట్లుగా చూపించడం.. అంతా కూడా నేటి యువత లవ్ స్టోరీలకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. మొత్తంగా అయితే, గ్లింప్స్‌లతోనే సినిమాను చూడాలనే ఫీల్‌ని మేకర్స్ కల్పించారు. త్వరలోనే మరిన్ని అప్డేట్‌లతో రానున్నామని చిత్రయూనిట్ ఈ సందర్భంగా తెలిపింది.

మొత్తానికి ‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్ యూత్‌ను టార్గెట్ చేస్తూ మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. సినిమా విడుదల కోసం ఎదురుచూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.