|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బడే సాహబ్ సస్పెన్స్: ధురంధర్ 2లో ఊహించని ట్విస్ట్! సల్మాన్, ఇమ్రాన్ ఔట్!

Published: 13-03-2026, 6:35 AM
బడే సాహబ్ సస్పెన్స్: ధురంధర్ 2లో ఊహించని ట్విస్ట్! సల్మాన్, ఇమ్రాన్ ఔట్!
  • ధురంధర్ 2లో ‘బడే సాహబ్’ పాత్ర గురించిన సస్పెన్స్ కొనసాగుతోంది.
  • సల్మాన్, ఇమ్రాన్ ఆ పాత్రలో లేరని ట్రేడ్ వర్గాల సమాచారం.
  • సినిమా విడుదల తర్వాతే ‘బడే సాహబ్’ ఎవరో తెలుస్తుందని అంచనా.
  • సినిమా మొదటి వారం 500 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

బాలీవుడ్ చిత్రం ధురంధర్ 2లో బడే సాహబ్ పాత్ర ఎవరు పోషించారనేది సస్పెన్స్‌గా మారింది. సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ ఆ పాత్రలో లేరని సమాచారం. ఈ పాత్ర గురించిన రహస్యాన్ని సినిమా విడుదల వరకు దాచి ఉంచారు.

బడే సాహబ్ పాత్రలో ఎవరు?

Dhurandhar 2 Cameo: బాలీవుడ్‌లో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ధురంధర్ 2 సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వినిపిస్తోంది. ఈ సినిమాలో బడే సాహబ్ అనే పాత్ర ఈ సినిమాకి హైలెట్ కానుంది అని ఎన్నో రోజుల నుంచి ప్రచారం ప్రచారం ఉంది. అయితే ఈ పాత్రలో ఎవరు నటించారన్న విషయం.. ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు.

సినిమా నిర్మాతలు, దర్శకుడు కూడా ఈ పాత్ర గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుకే సోషల్ మీడియా లో చాలా రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. మొదట ఈ పాత్రలో సల్మాన్ ఖాన్ లేదా ఇమ్రాన్ హష్మీ కనిపించవచ్చని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరు నటులు కూడా సినిమాలో ఆ పాత్రలో లేరని చెబుతున్నారు.

కొన్ని ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం బడే సాహబ్ పాత్రను ఎవరు చేశారో సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాతే ప్రేక్షకులకు తెలుస్తుందని అంటున్నారు. ఈ రహస్యాన్ని చివరి వరకు దాచడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాలని దర్శకుడు భావించినట్లు సమాచారం.

సల్మాన్, ఇమ్రాన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినా…

మొదటి భాగం కంటే “ధురంధర్ 2” సినిమాను మరింత భారీ స్థాయిలో రూపొందించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథలో అనేక సర్ప్రైజ్ అంశాలు ఉంటాయని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హీరోయిన్ యామి గౌతమ్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిపై కూడా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.

ఇంకా ఈ సినిమా తర్వాత మరిన్ని భాగాలు వస్తాయా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సీక్వెల్‌తో కథను బలంగా ముగించాలని అనుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సినిమాకు ఇప్పటికే కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారని, వాటి నుంచి వచ్చిన మొదటి స్పందనలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా “బడే సాహబ్” పాత్రలో ఒక పెద్ద స్టార్ ఉంటే సినిమా కలెక్షన్లు మరింత పెరగవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సినిమా వసూళ్లపై అంచనాలు

కొంతమంది ట్రేడ్ నిపుణులు ఈ సినిమా విడుదల తర్వాత భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అదే వేగం కొనసాగితే మొదటి వారంలోనే 500 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ అంచనాలు నిజమవుతాయా లేదా అన్నది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది. ప్రస్తుతం మాత్రం బడే సాహబ్ ఎవరు? అన్న ప్రశ్నే ప్రేక్షకులలో పెద్ద ఆసక్తిని పెంచుతోంది.

మొత్తానికి ధురంధర్ 2 సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బడే సాహబ్ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడటానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సినిమా భారీ విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.