|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం రేపిన ‘కేడీ: ది డెవిల్’ ఓటీటీ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే… మాస్ ఫ్యాన్స్ కు పండగే!

Published: 29-05-2026, 6:31 AM
సంచలనం రేపిన 'కేడీ: ది డెవిల్' ఓటీటీ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే... మాస్ ఫ్యాన్స్ కు పండగే!
  • ధృవ్ సర్జా ‘కేడీ: ది డెవిల్’ ఓటీటీ హక్కులు జీ5 సొంతం చేసుకుంది.
  • జూన్ 5 నుండి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
  • నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ పై భారీ వివాదం, మహిళా కమీషన్ వరకు వెళ్ళింది.
  • సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్ కీలక పాత్రల్లో మెరిశారు.

సంచలనం సృష్టించిన కన్నడ యాక్షన్ మూవీ ‘కేడీ: ది డెవిల్’ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది! విడుదల ముందు నుంచే వివాదాలతో రచ్చ చేసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాంపై ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. మాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త ఇది!

వివాదాల సుడిగుండంలో ‘కేడీ’ ప్రయాణం!

కన్నడ యాక్షన్ స్టార్ ధృవ్ సర్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కేడీ:ది డెవిల్’. దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రేష్మ ననయ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, శిల్పా శెట్టి, రమేష్ అరవింద్, రవి శంకర్ కీలక పాత్రలో కనిపించారు. అర్జున్ జన్మా సంగీతం అందించిన ఈ సినిమాను కేవి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఇందులో ఓ ఐటమ్ సాంగ్‌ను నోరా ఫతేహి చేయగా.. ఇందులో బూతులున్నాయంటూ విడుదలకు ముందు నానా రభస జరిగింది. అది కాస్త వివాదాస్పదమవడంతో పాటుగా మహిళా కమీషన్ వరకు వెళ్లగా.. మూవీ టీమ్ వివరణ కూడా ఇచ్చారు. ఈ సినిమా వివాదాలను దాటుకుని ఏప్రిల్ 30న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను రాబట్టుకుంది. ఈ మూవీ కథ విషయానికొస్తే.. బెంగళూరు నేపథ్యంలో 1970ల కాలం సాగుతుంది.

కలి దాస (కేడీ) చదువుకోలేదు.. కానీ తన కుటుంబం అంటే అతనికి అంతులేని ప్రేమ, విధేయత ఉంటాయి. అన్న ధర్మ చేతిలో ఎప్పుడూ తిట్లు తింటూ ఉంటాడు. డాన్ ధక్ దేవా అంటే అతనికి ఆరాధ భావన. అందరూ భయపడే డాన్‌ను దైవంగా భావిస్తుంటాడు. అయితే మంచు లక్ష్మితో ప్రేమలో పడిన తర్వా త కేడ జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. తాను దైవంగా భావించే ధక్ దేవా వల్ల తన కుటుంబానికి ప్రమాదం ఉందని, ధక్ దేవా అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని కేడీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత దేవాపై యుద్ధం ప్రకటించి ఎలా డెవిల్ అయ్యాడు? అనేది ఈ సినిమా కథ. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించినప్పటికీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘కేడీ: ది డెవిల్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకోగా.. జూన్ 5నుంచి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.

మాస్ యాక్షన్ తో ఓటీటీలో రచ్చకు సిద్ధం!

స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫాం డీటెయిల్స్ ఇవే!

వివాదాలు, మాస్ యాక్షన్ కలగలిసిన ‘కేడీ: ది డెవిల్’ ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. డిజిటల్ ప్రపంచంలో ఈ డెవిల్ చేసే రచ్చకు సిద్ధంగా ఉండండి! మరిన్ని సినీ విశేషాల కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.