|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

15 ఏళ్ల ప్రేమ.. లేచిపోదామనుకున్న కీర్తి సురేష్! చివరకు షాకింగ్ ట్విస్ట్!

Published: 29-01-2026, 7:35 AM
15 ఏళ్ల ప్రేమ.. లేచిపోదామనుకున్న కీర్తి సురేష్! చివరకు షాకింగ్ ట్విస్ట్!
  • కీర్తి సురేష్, ఆంటోనీలది 15 ఏళ్ల ప్రేమాయణం.
  • పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోదామనుకున్న జంట.
  • కీర్తి, ఆంటోనీల వివాహం 2024 డిసెంబర్‌లో జరిగింది.
  • సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ఆంటోనీ.

టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె, పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు. కానీ చివరకు ఊహించని ట్విస్ట్ జరిగింది.

కీర్తి సురేష్ ప్రేమాయణం

Tollywood Actress: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రస్తుతం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. బాలనటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈమె అనంతరం పలు సినిమాల ద్వారా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకోవడమే కాకుండా ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను గుర్తు చేసుకుంటూ ఎవరికి తెలియని కొన్ని విషయాలను బయటపెట్టారు. 2024 డిసెంబర్ నెలలో కీర్తి సురేష్ ఆంటోనీ తట్టిల్(Antony Thattil) అనే వ్యక్తిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం జరిగి ఏడాది పూర్తి అయింది. వీరిద్దరూ దాదాపు 15 సంవత్సరాల పాటు ప్రేమలో ఉంటూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత ఈ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

పెళ్లికి పెద్దల అంగీకారం

ఇక తన పెళ్లి గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ తాము 15 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాము ఆంటోనీ గురించి తన ఇంట్లో తెలిస్తే ఖచ్చితంగా మా పెళ్లికి ఒప్పుకోరని భావించాము ఇలా మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాము కానీ మా పెద్దలు మా పెళ్లి ని అంగీకరించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇలా మా పెళ్లి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అందుకే పెళ్లిరోజు ఆంటోని తాను చాలా ఎమోషనల్ అయ్యామని కీర్తి సురేష్ అప్పటి విషయాలను తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీకి దూరంగా ఆంటోని..

వైరల్ అవుతున్న కీర్తి కామెంట్స్

ఇక ఆంటోనీ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కీర్తి సురేష్ మాత్రం సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఇక వీరిద్దరికి పరిచయం కాలేజీ చదివే సమయంలోనే జరిగిందని అప్పటినుంచి ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయం బయటపడకుండా 15 సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించారు. ఇలా 15 సంవత్సరాల తరువాత ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక పెళ్లి తర్వాత కూడా కీర్తి సురేష్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈమె తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్దన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

కీర్తి సురేష్, ఆంటోనీల ప్రేమ కథ ఎంతోమందికి ఆదర్శం. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరగడం సంతోషకరం. వారి వైవాహిక జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.