|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒక్కోసారి నేను కూడా అప్‌సెట్‌ అవుతాను: కీర్తి సురేష్

Published: 19-07-2025, 3:32 AM
ఒక్కోసారి నేను కూడా అప్‌సెట్‌ అవుతాను: కీర్తి సురేష్

జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత కీర్తి సురేశ్ తన వృత్తి జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మరియు ఆమె భావోద్వేగాలను ఎలా నిర్వహిస్తుందో ఈ వార్త వివరిస్తుంది. తన తాజా చిత్రం ‘ఉప్పునుకారం’ ఓటీటీ విడుదల గురించి కూడా ఆమె మాట్లాడింది.

Key Points

1

కీర్తి సురేశ్ తన భావోద్వేగాలను ఎలా నిర్వహిస్తుందో వివరించింది.

2

బాలీవుడ్ ప్రవేశం తర్వాత ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి.

4

రివాల్వర్ రిటా, కన్నివెడి చిత్రాల విడుదల ఆమె కెరీర్‌ను మార్చే అవకాశం ఉంది.

కీర్తి సురేశ్ భావోద్వేగాలు

ఇంతకు ముందు తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటి కీర్తిసురేశ్‌( Keerthy Suresh ). కాగా ఎప్పుడైతే హిందీ చిత్రంలో నటించడానికి అంగీకరించిందో, అప్పటి నుంచి దక్షిణాదిలో నటించిన చిత్రాలు సక్సెస్‌కు దూరం అయ్యాయి. బాలీవుడ్‌లో నటించిన ఏకైక చిత్రం బేబిజాన్‌ పూర్తిగా నిరాశ పరచింది. అదే సమయంలో తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని, సంసార జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే సమీప కాలంలో కీర్తి సురేశ్‌ నటించిన ఉప్పు కారం చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం గురించి కీర్తి సురేశ్‌ చాలా ఎక్కువగానే ఊహించుకుంది. కానీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. ఆ తరువాత మరో కొత్త చిత్రంలో నటించలేదు.

బాలీవుడ్ ప్రయాణం

కమర్శియల్‌ చిత్రాల్లో నటించి, హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాల్లో నటించి, జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న నటికి ఇప్పుడు అవకాశాలు లేవంటే నమ్మశక్యం కాని పరిస్థితి. కొత్తగా అవకాశాలు రావడం లేదా? లేక ఈ బ్యూటీ అంగీకరించడం లేదా? అన్నది తెలియని పరిస్థితి. అయినా కీర్తిసురేశ్‌ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ ‘ఒక్కోసారి నేను అప్‌సెట్‌ అవుతుంటానని, అప్పుడు ఏం చేస్తానో తెలుసా. ఫుల్‌గా భోజనం చేస్తాను. అలాగే కారు తీసుకుని ఒంటరిగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లతాను.

భవిష్యత్తు ప్రాజెక్టులు

ఆ సమయంలో కారులో మంచి సంగీతం వింటాను. అలానే ఇంట్లో ఒక పెట్‌ కుక్కను పెంచుకుంటున్నాను. నేను అప్‌సెట్‌ అయితే దాని ముఖం చూస్తే వెంటనే అంతా మాయం అవుతుంది.’ అని కీర్తి సురేశ్‌ పేర్కొంది. కాగా ఈ అమ్మడు ఇంతకు ముందు నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు రివాల్వర్‌ రిటా, కన్నివెడి విడుదల కావలసి ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్‌ అయినా కీర్తిసురేశ్‌కు మళ్లీ క్రేజ్‌ పెరిగే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఈ అమ్మడు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

కీర్తి సురేశ్ ప్రస్తుతం వాణిజ్య ప్రకటనలలో బిజీగా ఉన్నారు. రివాల్వర్ రిటా మరియు కన్నివెడి చిత్రాల విజయం ఆమె కెరీర్‌కు కీలకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.