
టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా రీరిలీజ్ అయింది. సినిమాను చూసిన అభిమానులు ‘జై జగన్’ నినాదాలు చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు.
Key Points
మహేష్ బాబు 'ఖలేజా' సినిమా రీరిలీజ్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన.
థియేటర్లలో 'జై జగన్' నినాదాలు వినిపించడం.
సినిమా మరియు రాజకీయాల మధ్య సంబంధం.
ఖలేజా రీరిలీజ్‌కు అభిమానుల స్పందన
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ సినిమాల హవా కనిపిస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజులు వచ్చినా, ఆ సినిమా యానివర్సరీలు వచ్చినా సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఎలాంటి స్పెషల్ డేస్ లేకపోయినా రీరిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసిన సినిమాలకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇక రీసెంట్‌గా మహేశ్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమాను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటిసారి రిలీజ్ చేసిన సమయంలో ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది.
మొదటిరోజే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది.కారీ రీరిలీజ్ చేస్తే మాత్రం ప్రేక్షకులు, అభిమానులు ఎగబడి చూస్తున్నారు. అంతే కాకుండా అభిమానుల సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటుతున్నాయి. అభిమానులు పాటలు రాగానే డ్యాన్సులు చేయడం, సీన్లు రీక్రియేట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక ఈ మధ్య సినిమాలకు రాజకీయాలను లింక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీకే అభిమానులు కూడా సపోర్ట్ చేస్తుంటారు. దీంతో వైఎస్ఆర్ ఫ్యామిలీతో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉండటంతో కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్ లో అభిమానులు వైసీపీ నానాదాలు చేశారు. పార్టీ జెండాలతో పాటూ జై జగన్, జైబాబు అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
‘జై జగన్’ నినాదాలతో సందడి
టాలీవుడ్‌లో రీరిలీజ్ సినిమాల ప్రభావం
మొత్తంమీద, ఖలేజా సినిమా రీరిలీజ్ అభిమానులను ఉత్సాహపరిచింది. రాజకీయాలతో కూడిన ఈ సెలబ్రేషన్స్ సినిమాకు అదనపు ఆకర్షణను తెచ్చాయి.


