|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సుష్మితా సేన్‌కి అరుదైన వ్యాధి.. ప్రతి 8 గంటలకు ఓ స్టెరాయిడ్‌, లేదంటే..

Published: 02-07-2025, 1:17 AM
సుష్మితా సేన్‌కి అరుదైన వ్యాధి.. ప్రతి 8 గంటలకు ఓ స్టెరాయిడ్‌, లేదంటే..

ప్రముఖ నటి సుష్మితా సేన్ అరుదైన అడిసన్స్ వ్యాధితో బాధపడుతూ, ప్రతి ఎనిమిది గంటలకు స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకునేవారు. ఈ వ్యాధితో ఆమె ఎలా పోరాడింది, ఆమె ఆరోగ్యంలో ఏమి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.

Key Points

1

సుష్మితా సేన్ అరుదైన అడిసన్స్ వ్యాధితో బాధపడుతున్నారు.

2

ప్రతి 8 గంటలకు స్టెరాయిడ్ ఇంజక్షన్ తీసుకోవలసి వచ్చేది.

4

టర్కీ వైద్యులు ఆమె ఆరోగ్యంలో మెరుగైన మార్పును గుర్తించారు.

అరుదైన వ్యాధితో పోరాటం

నటీనటులు కూడా మనుషులే. వాళ్లకు అందరిలాగే కోపాలు, బాధలు, సమస్యలు ఉంటాయి.  కానీ వాటిని బయట ప్రపంచానికి తెలియనీకుండా.. సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంటారు. అలాంటి వారిలో నటి సుష్మితా సేన్‌ కూడా ఒకరు. తన అందచందాలతో అలరించడమే కాకుండా.. బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌ , జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఓ వర్గానికి ఇన్సిపిరేషన్‌గా నిలిచిన ఈ మాజీ మిస్‌ యూనివర్స్‌.. ఒకప్పుడు చావు అంచులదాక వెళ్లి వచ్చింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే..తెరపై ఎనర్జిటిక్‌గా కనిపించింది. మొన్నటి వరకు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్‌ తీసుకునేదట. ఆమె తీసుకున్న ఓ నిర్ణయమే ఇప్పుడు ఆమెని ఆరోగ్యకరంగా ఉండేలా చేసిందట.

ఏం జరిగింది? సుష్మిత కెరీర్‌ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే అనారోగ్య సమస్యలతో పోరాటం చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 2014 నుంచే ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌ అయిన అడిసన్స్ డిసీజ్‌తో బాధపడుతున్నటు వెల్లడించింది. ఆమె శరీరంలో కార్డిసోల్‌ అనే హర్మోన్‌ ఉందని తేలిందట. ఇది ప్రాణాంతకమైనది అని..దీన్ని సరి చేయాలంటే.. ప్రతి 8 గటలకు ఒకసారి హైడ్రో కార్డిసోన్‌ అనే స్టెరాయిడ్‌ ని ఇంజెక్ట్‌ చేయాలని వైద్యులు చెప్పారట. అలాగే వ్యాయామాలు, బరువైన పనులు చేయకూడదని సూచించారట.

ప్రతి 8 గంటలకు స్టెరాయిడ్

జిమ్నాస్టిక్స్‌ ప్రాక్టీస్‌ కానీ సుష్మిత మాత్రం తన ఫిట్నెస్‌ కోచ్‌ని పిలిపించుకొని జిమ్నాస్టిక్స్‌ ప్రాక్టీస్‌ చేసిదంట. యాంటీ గ్రావిటీ వ్యాయామాలతో పాటు డిటాక్సిఫికేషన్‌ ప్రారంభించిందట. అయితే ఓ రోజు సుష్మిత తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దుబాయ్‌ నుంచి అబుదబీ తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత టర్కీ వైద్యులు ఫోన్‌ చేసి సుష్మితా జీవితంలో మిరాకిల్‌ జరిగిందని చెప్పాడట. తన అడ్రిల్‌ గ్రంధి ఇప్పుడు సవ్యంగా పని చేస్తుందని చెప్పారట. తన 35 ఏళ్ల వైద్య కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. ఇకపై ఎనిమిది గంటలకు ఒకసారి స్టెరాయిడ్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో సుష్మితా ఊపిరిపీల్చుకుందంట.

ఆరోగ్యంలో మెరుగుదల

1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో  జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట(1994) విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలువరు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. తెలుగులో నాగార్జున తో కలిసి ‘రక్షకుడు’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ రాణించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌ చేస్తూ కెరీర్‌ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు.

సుష్మితా సేన్ తన అనారోగ్యంతో పోరాడి గెలిచిన విధానం ప్రేరణాదాయకం. ఆమె నిరంతర ప్రయత్నం, వైద్య సహకారం ఆమెను ఆరోగ్యంగా ఉంచాయి.

Related News

బిగ్ బ్రేకింగ్! వైరల్ స్టార్ కపుల్: షర్మిల మాండ్రే ఎంగేజ్‌మెంట్! నిర్మాత సుధన్‌తో పీటలెక్కనున్న హీరోయిన్! ఫొటోలు మంటలు.
కావ్య-అనిరుధ్ పెళ్లిపై బాబాయ్ మహేంద్రన్ షాకింగ్ క్లారిటీ! నిజంగానే కన్ఫర్మ్ అయ్యిందా?
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ స్టార్ సంచలనం! టైరీస్ గిబ్సన్ గుడిలో పూజలు.. ఎందుకో తెలిస్తే షాక్!
మాస్ షాక్: శోభనం రాత్రి బొద్దింకను నమిలేసిన హీరో! టీఆర్పీ కోసం ఇంత దారుణమా?
లాపతా లేడీస్ నటుడిపై దారుణ దాడి: రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామన్నారు! వీడియో వైరల్!
షాకింగ్ ట్విస్ట్: ప్రేమ చీకటి ప్లాన్! భర్తకు అబద్ధం, రామరాజు కుటుంబానికి దగా! ఇడ్లీ బాబాయ్ సన్యాసం? వైరల్ ప్రోమో!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.