|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్ దేవరకొండపై కియారా సీక్రెట్ లవ్.. పెళ్ళైనా ఆగని క్రష్!

Published: 31-03-2026, 6:45 AM
షాకింగ్: విజయ్ దేవరకొండపై కియారా సీక్రెట్ లవ్.. పెళ్ళైనా ఆగని క్రష్!
  • విజయ్ దేవరకొండపై బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ మనసు పారేసుకుందని రానా దగ్గుబాటి సీక్రెట్ రివీల్!
  • అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ అంటే చాలా ఇష్టమని చెప్పిన కియారా.. అభిమానుల షాక్!
  • రామ్ చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ సమయంలో కూడా విజయ్ గురించి ఆరా తీసిన కియారా అద్వానీ.
  • యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ మూవీలో కియారా అద్వానీ.. జూన్ 04న విడుదల కానుంది!

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి విజయ్ అంటే క్రష్ అంట! ఈ విషయం పెళ్ళయ్యాక బయటపడటం సంచలనంగా మారింది.

విజయ్ అంటే పిచ్చ క్రష్: కియారా షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు తెలుగుతో పాటు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే విజయ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నను ప్రేమించి పెళ్లాడాడు. సౌత్ ఇండియా స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకుని హనీమూన్‌ కూడా కంప్లీట్ చేసుకుని.. వారి సినిమాల్లో వారు ఫుల్లుగా బిజీ అయిపోయారు. ఈక్రమంలో విజయ్ పై బాలీవుడ్ హీరోయిన్ తన క్రష్ ను బయటపెట్టిన విషయం వైరల్ అవుతోంది.

తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను.. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటించింది. అయితే కియారా అద్వానీకి విజయ్ దేవరకొండపై సీరియస్‌గా క్రష్ ఉండేదని ఓ చిట్‌చాట్‌లో ఓపెన్‌గా ఒప్పుకుంది. కియారా అద్వానీకి ఒకప్పుడు విజయ్ దేవరకొండపై క్రష్ ఉండేదని రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన ఓ షోలో బయటపెట్టింది.

రానా షోలో లవ్ సీక్రెట్స్ లీక్ చేసిన కియారా అద్వానీ!

రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన ఓ క్యాజువల్ చిట్‌చాట్‌లో కియారా ఈ విషయం బయటపెట్టింది. విజయ్ దేవరకొండపై తనకు సాఫ్ట్ కార్నర్ ఉండేదని ఓపెన్‌గా చెప్పింది. “నేను అతనికి పెద్ద అభిమానిని. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం” అని తన క్రష్ గురించి మాట్లాడింది. ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నప్పుడు కూడా కియారా అప్పుడప్పుడు విజయ్ గురించి అడిగేదని సమాచారం.

ఇక విజయ్ దేవరకొండ గురించి మాటలు కొనసాగుతుండగా, కియారా సరదాగా ‘నన్ను విజయ్‌కి పరిచయం చేయొచ్చు కదా’ అని రానాని అడిగింది. దాంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు. నిజానికి, విజయ్, కియారా గతంలో కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో కలిసి పనిచేశారు. మొత్తానికి ఈ చిట్‌చాట్ వీడియో అభిమానులను.. సాధారణ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్’ సినిమాలో కియారా నటిస్తోంది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీగా ఉంది.

‘టాక్సిక్’ మూవీతో కియారా రీఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ప్రస్తుతం కియారా, యష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాలో నటిస్తోంది ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమూవీని జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి ఈ సినిమాను మార్చి 19న, ‘ధురంధర్-2’ రిలీజ్ రోజే విడుదల చేయాలనుకున్నారు. కానీ, యుద్ధ వాతావరణం కారణంగా సినిమా రిలీజ్‌ను జూన్ 04కి వాయిదా వేశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్లు నటిస్తున్నారు.

కియారా అద్వానీ, విజయ్ దేవరకొండల గురించిన ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.