
బాలీవుడ్ ప్రముఖ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం.
Key Points
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ దంపతులు తల్లిదండ్రులయ్యారు.
కియారా అద్వానీ ముంబైలో ఆడపిల్లకు జన్మనిచ్చారు.
ఈ జంట ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
సిద్ధార్థ్-కియారా దంపతులకు శుభవార్త
బాలీవుడ్ లో మరో స్టార్ కపుల్ పేరేంట్స్ గా మారారు. రణబీర్ కపూర్-అలియా భట్ జోడీలా సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పేరేంట్స్ క్లబ్ లో జాయిన్ అయ్యారు. ఈ జంట తమ తొలి బిడ్డకు వెల్ కమ్ చెప్పారు. ముంబయిలో కియారా అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.
బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. అయితే ఈ జంట నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రిలయన్స్ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ ద్వారా కియారా బిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వార్తతో బాలీవుడ్ లో సంతోషం నిండింది. ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ముంబైలో ఆడపిల్లకు జన్మనిచ్చిన కియారా
తాము పేరేంట్స్ కాబోతున్నామని ఈ ఏడాది ఫిబ్రవరిలో సోషల్ మీడియా పోస్టుల ద్వారా కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ జంట బేబీ సాక్స్ జతతో కూడిన హృదయపూర్వక ఇన్ స్టాగ్రామ్ పోస్టును పంచుకున్నారు. “మా జీవితంలో గొప్ప బహుమతి… త్వరలో వస్తుంది” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ ప్రకటనకు అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రేమ, అభినందనలు వెల్లువెత్తాయి.
సిద్ధార్థ్, కియారా లవ్ చేసి, ఆ తర్వాత డేటింగ్ లో ఉండి పెళ్లి చేసుకున్నారు. 2021 వార్ డ్రామా ‘షేర్షా’ లో కలిసి పనిచేయడానికి ముందు సిద్ధార్థ్, కియారా మొదటిసారి ఒక ప్రైవేట్ పార్టీలో కలుసుకున్నారు. అక్కడి నుంచి లవ్ జర్నీ స్టార్ట్ అయింది. వాళ్ల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ తో ఆన్ స్క్రీన్ జోడీ కూడా అదిరిపోయింది. వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ ను దాచారు. చివరకు ఫిబ్రవరి 7, 2023 న రాజస్థాన్లోని జైసల్మేర్లో వివాహం చేసుకున్నారు.
అభిమానుల నుండి శుభాకాంక్షలు
వివాహం అయినప్పటి నుంచి ఈ జంట లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. అయితే కియారా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా గర్భిణిగా కియారా ఫొటోలు సోషల్ మీడియాను ఊపేశాయి. ఇప్పుడు ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు ఇప్పటికే కొత్త తల్లిదండ్రులకు ప్రేమ, ఆశీస్సులు పంపడం ప్రారంభించారు. తల్లిదండ్రులుగా కొత్త జీవితంలో స్వాగతం చెబుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సిద్ధార్థ్ మరియు కియారా దంపతులకు పుట్టిన ఆడపిల్లకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సంతోషకరమైన సందర్భంలో వారికి మన హృదయపూర్వక అభినందనలు.


