
📌 Key Points
- ఒక మహిళ తొమ్మిది మందిని పెళ్లి చేసుకుని రూ.లక్షలు, నగలు దోచుకుంది.
- బీడ్ జిల్లాకు చెందిన యోగేష్ షిండే ఫిర్యాదుతో ఈ ‘లూటర్ బ్రైడ్’ స్కామ్ బయటపడింది.
- గ్రామీణ ప్రాంతాల్లోని పెళ్లికాని యువకులే ఈ ముఠా ప్రధాన లక్ష్యం.
- పరువు పోతుందనే భయంతో చాలామంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.
బీడ్ జిల్లాలో ‘లూటర్ బ్రైడ్’ స్కామ్ కలకలం రేపింది. తొమ్మిది మంది యువకులను పెళ్లి పేరుతో మోసం చేసి, లక్షల రూపాయలు, నగలు దోచుకున్న కిలేడీ ముఠా భాగోతం బయటపడింది. ఈ ఘటన ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది, పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
అమాయకులే లక్ష్యంగా భారీ మోసం
అమాయక యువకులే లక్ష్యంగా.. పెళ్లి పేరుతో బురిడీ కొట్టిస్తూ రూ.లక్షలు దోచుకుంటున్న ఒక భారీ ‘లూటర్ బ్రైడ్’ (Looter Bride) రాకెట్‌ను పోలీసులు చేధించారు. ఓ మహిళామణి ఏకంగా తొమ్మిది మందిని వివాహం చేసుకుని, అందినకాడికి నగదు, నగలతో పరారైన ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
బీడ్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన భాగోతం
పోలీసుల కథనం మేరకు బీడ్ (Beed) జిల్లాకు చెందిన యోగేష్ షిండే (Yogesh Shinde) అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ కిలేడీ భాగోతం బయటపడింది. యోగేష్‌కు మధ్యవర్తుల ద్వారా ఓ మహిళతో పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల పేరుతో ఏజెంట్లు అతడి నుంచి సుమారు రూ.25 లక్షలు వసూలు చేశారు. తీరా పెళ్లయిన కొద్ది రోజులకే ఆ పెళ్లికూతురు, ఆమెకు సహకరించిన ఏజెంట్లు ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలతో మాయమయ్యారు. దీంతో బాధితుడు యోగేష్ షిండే ఆరా తీయగా.. సదరు మహిళకు ఇప్పటికే 8 మందితో పెళ్లి జరిగిందని, ప్రతిసారీ ఇలాగే దోచుకుని పారిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయాడు. తాను మోసపోయానన్న ఆవేదనతో యోగేష్ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
మోసపోయిన యువకుల ఆవేదన
అయితే, ‘లూటర్ బ్రైడ్’ ముఠా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. పెళ్లి సంబంధాలు దొరక్క ఇబ్బంది పడుతున్న యువకులను తొలు ఏజెంట్ల ద్వారా గుర్తిస్తారు. పెళ్లికూతురు కుటుంబం నిరుపేదదని, ఆర్థికంగా సాయం చేయాలని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బు లాగుతారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే ప్లాన్ ప్రకారం నగలు, నగదు తీసుకుని పెళ్లికూతురు అదృశ్యమవుతుంది. ఇలా దాదాపు చాలామంది యువకులు ‘లూటర్ బ్రైడ్’ స్కామ్‌కు గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుడు యోగేష్ షిండే ఫిర్యాదు మేరకు బీడ్ జిల్లాలోని చక్లాంబా (Chaklambha) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు ‘లూటర్ బ్రైడ్’ ముఠా కోసం గాలింపు ముమ్మరం చేశారు. పరువు పోతుందన్న భయంతో చాలామంది బాధితులు బయటకు రావడం లేదని పోలీసులు తెలిపారు.
ఈ ‘లూటర్ బ్రైడ్’ స్కామ్ గ్రామీణ యువకుల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.


