
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమా ‘K ర్యాంప్’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య రహస్య గోరఖ్ కంటే ముందు జరిగిన లవ్ స్టోరీ గురించి, బీటెక్‌లో రెండేళ్ల ప్రేమ కథ, అలాగే మొదటి కిస్ గురించి వివరంగా చెప్పుకొచ్చారు. ఈ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Key Points
కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
'K ర్యాంప్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన మొదటి లవ్ స్టోరీని బయటపెట్టారు.
బీటెక్‌లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయగా ఆమె రిజెక్ట్ చేసిందని కిరణ్ అబ్బవరం తెలిపారు.
బీటెక్ థర్డ్ ఇయర్‌లో వేరే అమ్మాయితో తన మొదటి కిస్ జరిగిందని ఆసక్తికర విషయం పంచుకున్నారు.
కిరణ్ అబ్బవరం మొదటి ప్రేమ కథ
Kiran Abbavaram : టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం K ర్యాంప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇప్పుడు ఒక బాబు.(Kiran Abbavaram)
తాజాగా కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు.
బీటెక్‌లో లవ్ స్టోరీ.. రిజెక్షన్!
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. నేను ఇంటర్ వరకు బాయ్స్ స్కూల్, బాయ్స్ కాలేజీ. ఆ తర్వాత బిటెక్ లో జాయిన్ అయ్యాకే అమ్మాయిలు ఉన్నారు. బిటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కొత్తలో అప్పటిదాకా అబ్బాయిల మధ్య చదివి ఒక్కసారిగా అమ్మాయిలు కనపడటంతో వాళ్ళని చూస్తున్నాను. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. ఆమె కనపడిన మొదటి రోజే వెళ్లి ప్రపోజ్ చేశాను. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. రెండేళ్లు గట్టిగానే ట్రై చేశాను. వర్కౌట్ అవ్వక వదిలేసా. కానీ నేను వదిలేసాక ఆమెకు నా మీద ఇష్టం కలిగింది. కానీ అప్పుడు లవ్ చేసే మూడ్ లో లేను అందుకే నో చెప్పాను అని తెలిపాడు.
అమ్మాయితో మొదటి కిస్ వివరాలు
అలాగే తన ఫస్ట్ కిస్ గురించి మాట్లాడుతూ.. బిటెక్ థర్డ్ ఇయర్ లో వేరే అమ్మాయితో ఫస్ట్ కిస్ చేశాను అని తెలిపాడు. కాలేజీ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీలు ఏమి లేవు. ఆ తర్వాత రహస్య నా లైఫ్ లోకి వచ్చింది అని చెప్పుకొచ్చాడు.
మొత్తంగా, కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఆయన మొదటి ప్రేమ, రిజెక్షన్, అలాగే ఫస్ట్ కిస్ లాంటి వివరాలు ఆయన ఫాలోవర్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేశాయి.


