|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ న్యూ ఇయర్ వేడుకలు: కొడుకుతో క్యూట్ ఫొటోలు వైరల్, నెటిజన్లు ఫిదా!

Published: 01-01-2026, 2:30 AM
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ న్యూ ఇయర్ వేడుకలు: కొడుకుతో క్యూట్ ఫొటోలు వైరల్, నెటిజన్లు ఫిదా!
  • కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ 2024లో వివాహం చేసుకుని ఒక బాబుకు తల్లిదండ్రులయ్యారు.
  • న్యూ ఇయర్ సందర్భంగా కొడుకుతో కలిసి ట్రెడిషనల్ ఫొటోలను పంచుకున్నారు.
  • 2025 గొప్ప సంవత్సరమని, 2026 కోసం ఎదురుచూస్తున్నట్లు కిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
  • అభిమానులు, నెటిజన్లు వారిని ‘సూపర్ ఫ్యామిలీ’ అంటూ ప్రశంసిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ తమ ముద్దుల కుమారుడితో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. వారు షేర్ చేసిన సంప్రదాయ ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ అందమైన కుటుంబంపై నెటిజన్లు ‘సూపర్ ఫ్యామిలీ’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం కెరీర్, రహస్యతో ప్రేమ కథ!

‘రాజావారు రాణిగారు’(Raja Varu Rani Varu) చిత్రంతో హీరోగా పరిచయమైన తెలుగు యంగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే హిట్టు కొట్టి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ‘సెబాస్టియన్ పీ 524’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, ‘వినరో భాగ్యము విష్ణు కధ’, ‘రూల్స్ రంజన్’.. ఇలా వరుస చిత్రాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ తప్ప మిగిలిన వన్నీ ఫ్లాప్ కావడంతో కిరణ్ అబ్బవరం పని ఇక అయిపోయిందన్న టాక్ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ తర్వాత కసితో ‘క’(KA) మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.

న్యూ ఇయర్ వేడుకల్లో అద్భుతమైన ఫ్యామిలీ ఫొటోలు

ఆ దెబ్బతో తనను విమర్శించిన వాళ్ల నోరు మూయించాడు. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇక అతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ‘రాజాగారు రాణివారు’లో హీరోయిన్‌గా నటించిన రహస్య గోరఖ్‌(Rahashya Gorakh)తో ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డాడు. అలా కొంత కాలం సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ జంట 2024 లో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబు అచ్చం తన అమ్మలాగే ఉండటం విశేషం.

‘సూపర్ ఫ్యామిలీ’ అంటూ నెటిజన్ల ప్రశంసలు

ఈ క్రమంలో ఈ ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా కిరణ్ అబ్బవరం తన ఎక్స్ వేదికగా భార్య, కొడుకుతో న్యూ ఇయర్(New Year) సందర్భంగా కొన్ని ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేశాడు. అందులో వీరు చాలా సంప్రదాయంగా రెడీ అయి కనిపించారు. ఇక ఈ పిక్స్‌కు.. ‘2025 మాకు చాలా గొప్ప సంవత్సరం. ఇందులో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు. 2026 కోసం ఉత్సాహంగా ఉన్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ రెడ్ కలర్ హార్ట్ సింబల్ జోడించాడు. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఫ్యాన్స్, నెటిజన్స్ సూపర్ ఫ్యామిలీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఫ్యామిలీ ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. వారి సంప్రదాయ వేషధారణ, కొడుకుతో ఉన్న సంతోషకర క్షణాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అందమైన కుటుంబం ఎందరినో మెప్పించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.