|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కిరణ్ అబ్బవరం సంచలనం: డైరెక్టర్​గా మారుతూ.. హీరో కూడా తనేనా? దిమ్మతిరిగే ట్విస్ట్!

Published: 13-02-2026, 1:35 AM
కిరణ్ అబ్బవరం సంచలనం: డైరెక్టర్​గా మారుతూ.. హీరో కూడా తనేనా? దిమ్మతిరిగే ట్విస్ట్!
  • కిరణ్ అబ్బవరం డైరెక్షన్‌లోకి ఎంట్రీ.. స్వయంగా హీరోగా నటిస్తూ సంచలనం!
  • తొలి సినిమాతోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టిన కిరణ్ అబ్బవరం!
  • సాయి రాజేష్ దర్శకత్వంలో ‘చెన్నై లవ్ స్టోరీ’లో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ!
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కిరణ్ అబ్బవరం డైరెక్షన్ మూవీ.. త్వరలో ప్రకటన!

టాలీవుడ్ లో మరో సంచలనం! యంగ్ హీరో కిరణ్ అబ్బవరం డైరెక్టర్ గా మారుతున్నాడు. అంతే కాదు, తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో తనే హీరోగా నటించనుండడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!

డైరెక్టర్​గా కిరణ్ అబ్బవరం.. కథ రెడీ!

Kiran Abbavaram; టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రాణి వారు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ ఆ తరువాత కూడా పలు సినిమాలు చేశాడు. కానీ, రీసెంట్ గా క సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కే-ర్యాంప్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ర్యాంప్ ఆడించాడు. ఈ సినిమాతో ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నాడు ఈ హీరో.

ఇప్పుడున్న చాలా మంది హీరోలకి రూ.50 కోట్ల సినిమా లేకపోడం గమనార్హం. అలాంటిది కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఆ రేంజ్ కి వచ్చాడు అంటే అది మాములు విషయం కాదు. ప్రస్తుతం ఈ హీరో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బేబీ మూవీ ఫేమ్ సాయి రాజేష్ తెరకెక్కిస్తున్నాడు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్వయంగా హీరోగా కిరణ్.. ఇది నిజమా?

అయితే, ఈ నేపధ్యంలోనే కిరణ్ అబ్బవరం నెక్స్ట్ సినిమా గురించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే. గతంలో చాలా సార్లు తనకు డైరెక్షన్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఆ దర్శకుడిని బయటకు తీసే పనిలో పడ్డాడట కిరణ్ అబ్బవరం. దర్శకుడిగా తన మొదటి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. దీనికి సంబంధించి కథను కూడా ఇపప్టికే ఫిక్స్ చేశాడట కిరణ్ అబ్బవరం.

రూ.50 కోట్ల కలెక్షన్లతో కిరణ్ దూకుడు!

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుందట. అయితే, ఈ సినిమాలో నటించే హీరో ఎవరు అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కిరణ్ అబ్బవరం దర్శకుడిగా తన మొదటి సినిమా కోసం హీరోగా తననే తీసుకుంటున్నాడట. అవును ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే ఉంటారని తెలుస్తోంది. మరి కిరణ్ అబ్బవరం డైరెక్ట్ చేస్తున్న సినిమాకు ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అనేది చూడాలి.

కిరణ్ అబ్బవరం డైరెక్షన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఒక సంచలనమే. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అప్పటివరకు వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.