
బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘కిష్కింధపురి’ హారర్ థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ షోకు అద్భుతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల ప్రతిస్పందనను బట్టి సినిమా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Key Points
బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతమైన నటన
అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో అదిరిపోయే పాత్ర
గ్రిప్పింగ్ హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించిన కిష్కింధపురి
పార్ట్ 2 కు ఆసక్తికరమైన ముగింపు
కిష్కింధపురి ప్రీమియర్ షో రివ్యూ
Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘కిష్కింధపురి’. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కిష్కింధపురి రేపు సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుండగా నైన్ కొంతమంది మీమర్స్ కి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కి ప్రీమియర్స్ వేశారు.(Kishkindhapuri)
ఈ ప్రీమియర్స్ టాక్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో కిష్కింధపూరి ప్రీమియర్ షో వేశారు. సినిమా మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్నా తర్వాత కథ వేగంగా పరిగెడుతుంది. కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగు పెట్టాక అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడట. ఫస్టాఫ్ సింపుల్ గా అక్కడక్కడా భయపెడుతూ అనుకున్న పాయింట్ ని చెప్పారట.
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటన
Also See : బాలీవుడ్ షోలో మిరాయ్ మూవీ టీమ్ సందడి.. కపిల్ శర్మ షో ప్రోమో వైరల్..
సెకెండ్ హాఫ్ మాత్రం గ్రిప్పింగ్ గా హారర్ ఎలిమెంట్స్ ఎక్కడా తక్కువ చేయకుండా అదరగొట్టాడట డైరెక్టర్. తమిళ నటుడు శాండ సినిమాలో హైలెట్ అట. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో అదరగొట్టాడట. ఈ సినిమాతో బెల్లంకొండ బాబు హిట్ కొట్టాడని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ దయ్యం పట్టిన పాత్రలో క్లైమాక్స్ లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిందట.
హారర్ ఎలిమెంట్స్ & కథానకం
థ్రిల్లర్ ఎపిసోడ్స్, సౌండింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హారర్ అనుభవం ఇచ్చి భయపెట్టారట.కిష్కింధపురి ప్రేక్షకులను భయపెడుతూ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి అలరిస్తుందని అంటున్నారు. అలాగే పార్ట్ 2 కోసం కూడా లీడ్ ఇచ్చారట క్లైమాక్స్ లో.
మొత్తం మీద, కిష్కింధపురి ప్రేక్షకులను భయపెట్టి, అలరించింది. బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. పార్ట్ 2 కోసం ఆసక్తికరమైన ముగింపుతో సినిమా ముగుస్తుంది.


