
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘KJQ’ టీజర్ విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది. దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Key Points
శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోగా కొత్త సినిమా 'KJQ'
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి కీలక పాత్ర
బోల్డ్ బ్యూటీ యుక్తి తరేజ హీరోయిన్‌గా నటిస్తున్నారు
ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం
శ్రీకాంత్ ఓదెల తమ్ముడి కొత్త సినిమా
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తమ్ముడు శశి ఓదెల (Shashi Odela), దసరా ఫేం దీక్షిత్ శెట్టి (Dixit Shetty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కెతున్న లేటెస్ట్ మూవీ ‘KJQ’ (కింగ్ జాకీ క్వీన్). ఈ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కె.కె దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘ఈ సిటీ.. గన్.. రెండు ఒక్కటే. ఎవడి చేతిలో ఉంటదో వాటి మాటే ఇంటది’ అనే బ్యాగ్రౌండ్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ టీజర్ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో ఎంతో ఆసక్తిగా సాగింది. ‘పోయి చెప్పు.. ఈ ఊరికి ఒక మొగాడు వచ్చాడు’ అని దీక్షిత్ చెప్పే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
యాక్షన్ థ్రిల్లర్ ‘KJQ’
కాగా.. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ యుక్తి తరేజ (Yukti Thareja) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘మొగాడు గెలుచుకుంటాడు.. కానీవాడు లాక్కుంటాడు.. నువ్వేంటి’ అంటూ యుక్తి సినిమాపై అంచనాలను మరింత క్రియేట్ చేసింది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో యుక్తి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే 2023లో నాగ శౌర్య ‘రంగబలి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. రీసెంట్‌గా వచ్చిన ‘మార్కో’తో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు త్వరలో KJQతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
యుక్తి తరేజ హీరోయిన్‌గా
A post shared by Yukti Thareja (@realyukti)
మొత్తంమీద, ‘KJQ’ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకునే అవకాశం ఉంది. యుక్తి తరేజ, దీక్షిత్ శెట్టిల నటన ప్రేక్షకులను అలరించనుంది.


