|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Komali Prasad: ఆ సినిమా చూసి అస్సలు సిగ్గు లేకుండా డైరెక్టర్‌కు మెసేజ్ చేశా.. హిట్-3 నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 08-05-2025, 11:46 AM
Komali Prasad: ఆ సినిమా చూసి అస్సలు సిగ్గు లేకుండా డైరెక్టర్‌కు మెసేజ్ చేశా.. హిట్-3 నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

హిట్-3 సినిమాతో పేరు తెచ్చుకున్న యంగ్ నటి కోమలి ప్రసాద్, తన అనుభవాలను, ప్రత్యేకంగా ‘లూజర్’ వెబ్ సిరీస్ మరియు దర్శకుడు వెంకటేష్ మహా గురించి పంచుకుంది. ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Key Points

1

హిట్-3 సినిమాతో గుర్తింపు పొందిన కోమలి ప్రసాద్.

2

'లూజర్' వెబ్ సిరీస్‌ను ప్రత్యేకంగా గుర్తుంచుకుంటున్నానని కోమలి.

4

'కెరాఫ్ కంచరపాలెం' చూసి డైరెక్టర్‌కు నేరుగా మెసేజ్ చేశానని కోమలి వెల్లడి.

కోమలి ప్రసాద్ యొక్క ‘లూజర్’ అనుభవం

నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘హిట్ 3’ (Hit 3) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ నటి కోమలి ప్రసాద్ (Komali Prasad). ‘హిట్: ది సెకండ్ కేస్’ (Hit: The Second Case)లో నటించిన ఈ అమ్మడు.. హిట్-3 లో మాత్రం ఫుల్ లెంత్ రోల్ చేసి హీరోయిన్ శ్రీనిధి శెట్టి కంటే కూడా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో కోమలి పేరు ట్రెండింగ్‌లోకి చేరింది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఆమె నటించిన లూజర్ వెబ్ సిరీస్‌పై అలాగే డైరెక్టర్ మహా వెంకటేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘నేను చేసిన అన్నీ సినిమాల్లో నాకు ‘లూజర్’ చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. అందులో నా చేసిన ఆశ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. అది నా ఫస్ట్ బెస్ట్ ఆఫర్. ఈ చిత్రం నాకు ‘మహానటి’ సినిమా ఫీల్ ఇచ్చింది. ఒక కొత్త అమ్మాయికి బ్లాక్ అండ్ వైట్ స్టోరీ ఇవ్వడం అలాగే.. క్రికెటర్ వైఫ్ పాత్రలో చేయడం నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది. తర్వాత ‘మోడరన్ లవ్’ సిరీస్. అందులో నేను ఇందు క్యారెక్టర్ చేశాను. ఇది నా డ్రీమ్స్ కమ్ ట్రూ మూవీ. ఎందుకంటే నాకు వెంకటేష్ మహా (Venkatesh Maha) డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన ‘కెరాఫ్ కంచరపాలెం’ సినిమా నాకు చాలా ఇష్టం. ఎవరైనా కొత్త వాళ్లతో మాట్లాడాలంటే కాస్త సిగ్గు పడతారు. కానీ ‘కెరాఫ్ కంచరపాలెం’ సినిమా చూసిన వెంటనే డైరెక్టర్ మహాకు సిగ్గు లేకుండా నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నా అని మెసేజ్ చేశా. ఆ తర్వాత మెడరన్ లవ్ సిరీస్‌లో రెండు ఎపిసోడ్స్ మొత్తం నా భుజాలపైనే వేసేశారు’ అంటూ చెప్పుకొచ్చింది.

వెంకటేష్ మహాతో కోమలి ప్రసాద్ అనుబంధం

హిట్-3 తర్వాత కోమలి ప్రసాద్ కెరీర్

కోమలి ప్రసాద్ యొక్క నిర్భయత మరియు ఓపెన్‌నెస్ ఆమె వ్యక్తిత్వాన్ని చూపుతున్నాయి. ఆమె భవిష్యత్ కెరీర్‌కు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.