|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొరటాల శివ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా.. ఎవ్వరూ ఊహించని హీరోతో మూవీకి ప్లాన్ ?

Published: 16-08-2025, 12:20 PM
కొరటాల శివ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా.. ఎవ్వరూ ఊహించని హీరోతో మూవీకి ప్లాన్ ?

దేవర చిత్రం తర్వాత కొరటాల శివ తన తదుపరి చిత్రం గురించి ఇంకా ప్రకటించలేదు. తాజా వార్తల ప్రకారం, ఆయన నాగ చైతన్యతో కొత్త చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Key Points

1

కొరటాల శివ తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు

2

నాగ చైతన్యతో కొత్త సినిమాకు ప్లాన్?

4

దేవర తర్వాత కొరటాల శివ బౌన్స్ బ్యాక్ కు ప్రయత్నం

కొరటాల శివ తదుపరి చిత్రం ఎవరితో?

గత ఏడాది విడుదలైన దేవర చిత్రం తర్వాత డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. దేవర 2 చేయాల్సి ఉంది. కానీ ఇప్పట్లో ఆ చిత్రం పట్టాలెక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాను కమిటైన చిత్రాలని ఆపి దేవర 2కి సమయం కేటాయించే పరిస్థితి ఉందా అంటే అది అనుమానమే.

కొరటాల శివ తదుపరి చిత్రం గురించి వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన కొరటాల శివ ఈసారి పెద్ద స్టార్ కాకుండా నాగ చైతన్యతో మూవీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నాగ చైతన్యతో సినిమాకు అవకాశాలున్నాయా?

నాగ చైతన్య చివరగా తండేల్ చిత్రం విజయంతో మంచి జోరు మీద ఉన్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య తన 24వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా కొరటాల శివ ఇటీవల కొన్ని సార్లు నాగ చైతన్యని మీట్ అయినట్లు తెలుస్తోంది.

ఒక స్టోరీ ఐడియాని కొరటాల చైతు ముందు ఉంచారట. కొరటాల చెప్పిన లైన్ నాగ చైతన్యకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ తప్పకుండా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ తన పూర్తి సత్తా చూపి చాలాకాలం అవుతోంది. చిరంజీవితో రూపొందించిన ఆచార్య చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఎన్టీఆర్ తో తెరకెక్కించిన దేవర చిత్రం దేవర కూడా పర్వాలేదనిపించింది కానీ పూర్తి స్థాయిలో అంచనాలని అందుకోలేదు.

దేవర తర్వాత కొరటాల శివ భవిష్యత్తు ఏమిటి?

దీనితో కొరటాల శివ.. నాగ చైతన్యతో ఒక చిత్రం రూపొందించి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ ప్రభాస్ మిర్చి చిత్రంతో డైరెక్టర్ గా మారారు. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి చిత్రాలతో ఘనవిజయాలు అందుకున్నారు.

చివరగా, కొరటాల శివ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నాగ చైతన్యతో కలిసి సినిమా చేస్తే ఆయన కెరీర్ లో మరో మలుపు తిరుగుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.