|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ అంటే అందుకే చాలా కోపం, ఆయన చరిత్రని ఆయనే చెరిపివేసుకున్నారు.. ఓపెన్ గా మ్యాటర్ బయటపెట్టిన కోట

Published: 20-07-2025, 4:19 AM
ఎన్టీఆర్ అంటే అందుకే చాలా కోపం, ఆయన చరిత్రని ఆయనే చెరిపివేసుకున్నారు.. ఓపెన్ గా మ్యాటర్ బయటపెట్టిన కోట

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణానంతరం ఆయన ఎన్టీఆర్ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రెండో వివాహంపై కోట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో ఎన్టీఆర్ జీవితంపై విమర్శలు, అభిప్రాయాలు ఉన్నాయి.

Key Points

1

కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ రెండో వివాహంపై తీవ్ర విమర్శలు చేశారు.

2

ఎన్టీఆర్ తన చరిత్రను తానే చెరిపేసుకున్నాడని కోట అభిప్రాయపడ్డారు.

4

కోట, ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ లో ముక్కుసూటితనం ఉండే నటుల్లో కోట శ్రీనివాస రావు ఒకరు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేయడం ఆయనకి అలవాటు. కొన్ని రోజుల క్రితం జూలై 13న కోట శ్రీనివాసరావు మరణించారు. 750 పైగా చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. తెలుగు సినిమాల్లో ఎక్కువగా తెలుగు నటీనటులకే అవకాశాలు ఇవ్వాలని చివరి వరకు కోట తన గళం వినిపించారు.

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తెరకెక్కించిన మండలాధీశుడు చిత్రంలో నటించి వివాదంలో నిలిచారు. ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట మాట్లాడుతూ.. తెలుగువారి సత్తా చూపించిన మహానుభావుడు ఎన్టీఆర్. కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించారు. అలాంటి వ్యక్తి తన చరిత్రని తానే చెరిపివేసుకున్నాడు. 60 ఏళ్ళ వయసొచ్చిన తర్వాత మరో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ? ఆయన భార్య బసవతారకం గారు 12 మంది పిల్లలని కని పెంచిన మహా ఇల్లాలు. అనారోగ్యం కారణంగా మరణించారు.

ఎన్టీఆర్ రెండో వివాహంపై విమర్శలు

అలాంటి మహా ఇల్లాలిని మరచిపోయి మరో మహిళ మెడలో తాళి కట్టడానికి ఆయనకి మనసు ఎలా వచ్చింది. ఆ విషయంలో రామారావు గారు అంటే నాకు చాలా కోపం. ఆ వయసులో నీకు ఎం కావాలి ? శృంగారమా ? అంటూ కోట సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ ఆయనకి ఆ వయసులో తోడు కావాలి అనిపిస్తే పిల్లలతో మాట్లాడి ఉండాలి. ఆ విషయంలో ఆయన పిల్లలు కూడా తప్పు చేశారు. అప్పట్లోనే ఎన్టీఆర్ తన పిల్లలందరికీ రూ.4 కోట్ల వరకు ఆస్తులు పంచారు.

ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని ఎన్టీఆర్ బాగోగులు చూసి ఉండాలి. ఏది ఏమైనా ఆయన రెండో పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. ఆ విషయంలో నా కడుపు రగిలిపోయింది. ఆ వయసులో ఆయనకి ఒక అసిస్టెంట్ ఉంటే సరిపోతుంది. పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు. పద్మనాభం గారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత. కానీ చివరికి ట్రైన్ లో సెకండ్ క్లాస్ లో ప్రయాణించే స్థితి చేరుకున్నారు అని కోట గుర్తు చేశారు.

కోట ఆగ్రహం, ఎన్టీఆర్ పిల్లల బాధ్యత

ఆ ఒక్క తప్పు చేసి ఎన్టీఆర్ తన చరిత్రని తానే రబ్బరుతో చెరిపి వేసుకున్నారు అని కోట తెలిపారు. ఎన్టీఆర్ 1993లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ వివాహం గురించి అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది.

కోట శ్రీనివాసరావు మాటలు ఎన్టీఆర్ రెండో వివాహంపై ఇప్పటికీ ఉన్న చర్చను మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు, వాటి ప్రభావం చర్చనీయాంశంగా మిగిలాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.