
మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ఆగస్టు 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్రం, ఉదయభాను పాత్ర, కథ గురించి వివరించారు.
Key Points
కృష్ణుడు బార్బరికుడిని వరం అడిగి కురుక్షేత్ర యుద్ధాన్ని జరిగేలా చేస్తాడు.
ఉదయభాను పాత్ర చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.
త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది.
దర్శకుడు మోహన్ శ్రీవత్స చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బార్బరికుడు మరియు కురుక్షేత్ర యుద్ధం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ మారుతి. దర్శకుడు మారుతి సమర్పణలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ , సాంచీ రాయ్, క్రాంతి కిరణ్ నటించిన ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.
ఆగస్ట్ 29న థియేటర్లలో త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బార్బరిక్ గురించి, ఉదయభాను పాత్ర, తదితర సినీ విశేషాలను పంచుకున్నారు దర్శకుడు మోహన్ శ్రీవత్స.
బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలరు. అలాంటి బార్బరికుడిని కృష్ణుడు ఓ వరం అడిగి యుద్దాన్ని జరిగేలా చేస్తారు. నార్త్‌లో బార్బరికుడుకు ఫాలోయింగ్ చాలా ఉంటుంది. సత్యరాజ్ గారు బార్బరికుడిలా కొన్ని చోట్ల కనిపిస్తారు. మేకప్ విషయంలో ఆయనను చాలా కష్టపెట్టాను.
ఉదయభాను పాత్ర ప్రాముఖ్యత
‘బార్బరిక్’ కథలో చాలా లేయర్స్ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకే మైథలాజికల్ టచ్ ఇచ్చాను. ‘బార్బరిక్’ కంటెంట్ బేస్డ్ మూవీ. ఇందులోని ప్రతీ పాత్రకు భిన్న పార్శ్యాలు ఉంటాయి. సత్యరాజ్ గారు, ఉదయభాను గారు, వశిష్ట గారు ఇలా అందరూ అద్భుతంగా నటించారు.
నాకు మ్యూజిక్ మీద టచ్ ఉంది. ఆ విషయంలో ఆడియెన్స్ పల్స్ నాకు తెలుసు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్‌తో నాకు మంచి బంధం ఉంది. మాకు అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ కూడా అదిరిపోతుంది. కొత్తగా ఉండాలనే ఇలా బ్యాండ్‌ని తీసుకున్నాను.
‘బార్బరిక్’ సబ్జెక్ట్‌కి తగ్గట్టుగా నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారికి ఓ బడ్జెట్ చెప్పాను. మారుతి గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మా నిర్మాత విజయ్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మాకు అండగా నిలిచారు.
దర్శకుడు మోహన్ శ్రీవత్స కామెంట్లు
‘ బార్బరిక్ ’ చిత్రంలో హీరో, విలన్ అని ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. అన్ని పాత్రల్లోనూ అంతర్గిక యుద్దం జరుగుతుంటుంది. ఈ మూవీతో మంచి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను.
తెలిసో తెలియకో అందరం తప్పులు చేస్తుంటాం. అన్ని ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అని చెప్పదల్చుకుంటున్నాను. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అందరినీ అలరించేలా మా చిత్రం ఉంటుంది.
చిత్రంలోని ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఒక మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.


