|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా?

Published: 15-08-2025, 7:47 AM
ఒకే ఏడాది 7 సార్లు పోటీ పడ్డ కృష్ణ, చిరంజీవి..అడ్రస్ లేకుండా పోయిన సినిమాలు, పైచేయి ఎవరిదో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక స్థానం కలిగి ఉన్నారు. 1984లో వీరిద్దరూ ఏకంగా ఏడు సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఈ పోటీలో వారి సినిమాల విజయవంతత ఎలా ఉందో చూద్దాం.

Key Points

1

1984లో కృష్ణ, చిరంజీవి 7 సార్లు బాక్సాఫీస్ పోటీ.

2

రెండు స్టార్ల సినిమాలు పోటీలో ఎవరికి ఎలాంటి విజయం?

4

బ్లాక్ బస్టర్ హిట్లు, ఫ్లాపులు, యావరేజ్ సినిమాల పోటీ తీవ్రత.

1984: కృష్ణ, చిరంజీవి మధ్య భారీ పోటీ

సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక చరిత్ర ఉంది. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమని శాసించిన హీరోలు వీరిద్దరూ. 80వ దశకంలో సూపర్ స్టార్ కృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చిరంజీవి సరికొత్త స్టార్ గా టాలీవుడ్ లో ఎదిగింది కూడా అప్పుడే. 80వ దశకంలో చిరంజీవి, కృష్ణ నటించిన చిత్రాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి.

1984లో మాత్రం వీరిద్దరూ తమ చిత్రాలతో ఏకంగా 7 సార్లు బాక్సాఫీస్ వార్ కి దిగారు. ఈ పోటీలో విజయం ఎవరిది ? బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఆ చిత్రాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 1984 ఫిబ్రవరి 11 న చిరంజీవి నటించిన అల్లుళ్ళొస్తున్నారు చిత్రం విడుదలైంది. 5 రోజుల గ్యాప్ లో కృష్ణ నటించిన రక్తసంబంధం చిత్రం విడుదలయింది. ఈ మూవీలో కృష్ణ ట్రిపుల్ రోల్ లో నటించారు. చిరంజీవి అల్లుళ్ళొస్తున్నారు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కృష్ణ రక్తసంబంధం మాత్రం యావరేజ్ గా నిలిచింది.

ఏడు సినిమాల పోటీ: విజయాలు మరియు ఓటములు

అదే ఏడాది మార్చి 23న చిరంజీవి నటించిన ‘హీరో’ చిత్రం రిలీజ్ అయింది. వారం గ్యాప్ లో కృష్ణ పులిజూదం చిత్రం రిలీజ్ అయింది. రెండూ యాక్షన్ చిత్రాలే. అయినప్పటికీ ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. ఏప్రిల్ 12న మరోసారి చిరంజీవి, కృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ జరిగింది. ఏప్రిల్ 12న చిరంజీవి దేవాంతకుడు చిత్రం విడుదలైంది. రెండు వారాల గ్యాప్ లో కృష్ణ తన ముఖ్యమంత్రి చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.

ఆ తర్వాత జూన్ 20న సూపర్ స్టార్ కృష్ణ కిరాయి అల్లుడు చిత్రం రిలీజ్ అయింది. వారం రోజుల గ్యాప్ లో చిరంజీవి మహానగరంలో మాయగాడు చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రం నిరాశ పరచగా కృష్ణ కిరాయి అల్లుడు చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆగష్టు 9న చిరంజీవి ఛాలెంజ్ మూవీ రిలీజ్ అయింది. అదే రోజున కృష్ణ బంగారు కాపురం చిత్రం కూడా విడుదలైంది. చిరంజీవి ఛాలెంజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాగా కృష్ణ బంగారు కాపురం మూవీ ఆకట్టుకోలేకపోయింది.

బాక్సాఫీస్ వద్ద ఎవరు గెలిచారు?

సెప్టెంబర్ లో చిరంజీవి ఇంటిగుట్టు చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రానికి వారం ముందు విడుదలైన కృష్ణ ఉద్దండుడు చిత్రం ఫ్లాప్ అయింది. చిరంజీవి ఇంటి గుట్టు మాత్రం మంచి విజయం సాధించింది. సెప్టెంబర్ 28న కృష్ణ కంచు కాగడా చిత్రం రిలిజ్ అయింది. రెండు వారాల గ్యాప్ లో చిరంజీవి నాగు మూవీ విడుదలైంది. ఈ రెండు చిత్రాలు మంచి వసూళ్లనే రాబట్టాయి కానీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేక యావరేజ్ గా నిలిచాయి. ఈ విధంగా చిరంజీవి, కృష్ణ 1984లో ఏడుసార్లు పోటీ పడ్డప్పటికీ ఇద్దరూ మిక్స్డ్ రిజల్ట్స్ తో సమఉజ్జీలుగా నిలిచారు.

చివరగా, 1984 సంవత్సరం కృష్ణ, చిరంజీవి ఇద్దరికీ సవాళ్ళతో కూడిన సంవత్సరంగా నిలిచింది. వారి సినిమాల విజయవంతత వేర్వేరుగా ఉన్నప్పటికీ, రెండు స్టార్లకు ప్రేక్షకుల మధ్య అపారమైన ప్రజాదరణ ఉందని నిరూపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.