|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కృతి పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు! ప్రభాస్ బ్యూటీ మనసులో ఏముందో?

Published: 28-03-2026, 2:35 PM
కృతి పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు! ప్రభాస్ బ్యూటీ మనసులో ఏముందో?
  • కృతి సనన్ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.
  • ప్రభాస్, కృతి సనన్ కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించారు.
  • కృతి సనన్ మొదటి చిత్రం మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’.
  • సరైన సమయం వచ్చినప్పుడు తన నిబంధనల ప్రకారమే పెళ్లి చేసుకుంటానని కృతి అన్నారు.

ప్రముఖ నటి కృతి సనన్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. జీవితంలో పెళ్లి మాత్రమే కాదని, ఇంకా చాలా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. సరైన సమయం వచ్చినప్పుడు తన నిబంధనల ప్రకారమే వివాహం చేసుకుంటానని ఆమె తెలిపారు.

కృతి సనన్ పెళ్లిపై స్పందన

Kriti Sanon: సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో లేదా హీరోయిన్ తమ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు అంటే.. ఆ తర్వాత వారి వ్యక్తిగత జీవితాలపై అభిమానులు ఫోకస్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తమ అభిమాన నటీనటులు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఎప్పుడు కొత్త జీవితాన్ని మొదలు పెడతారు? అనే ఆలోచనలు ఎప్పటికప్పుడు వారిలో మెదులుతూనే ఉంటాయి. అంతేకాదు ఒకవేళ పబ్లిక్ లో కనిపించాలంటే చాలు తమ ఆలోచనలను సెలెబ్రెటీల ముందు ఉంచుతారు కూడా.. అయితే అందులో కొంతమంది తమ పెళ్లిపై స్పందిస్తే.. మరికొంతమంది చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రభాస్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కృతి సనన్ (Kriti Sanon) తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టి తన అభిప్రాయాలను పంచుకుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె తొలిసారి మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన ‘వన్ నేనొక్కడినే’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న కృతి సనన్ ఈ చిత్రంతో ఊహించని ఇమేజ్ దక్కించుకోవాలని చూసింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈమెకు పాపులారిటీ లభించలేదు. సుకుమార్ దర్శకత్వంలో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా నిలవలేదు. కనీసం ఆది పురుష్ తోనైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనుకోగా.. ఇది కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కృతి సనన్ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సమ్మిట్ లో పాల్గొని పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు కాస్త అసహనం వ్యక్తం చేసింది.

ఆదిపురుష్ సినిమాలో కృతి, ప్రభాస్

పెళ్లిపై కృతి సనన్ మాట్లాడుతూ..” జీవితం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు కదా.. అంతకుమించి ఎంతో ఉంటుంది. ఈ విషయాన్ని ఎందుకు ఎవరు గమనించడం లేదు. సెలబ్రిటీ కనిపిస్తే చాలు సింగిల్ అయితే ఎప్పుడు పెళ్లి అని ప్రశ్నిస్తున్నారు.. కాస్త మా వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూసేటప్పుడు మేము పడుతున్న ఇబ్బందుల గురించి కూడా మీరు ఆలోచించాలి” అంటూ కామెంట్ చేసింది కృతి సనన్. ఇకపోతే అదే సమయంలో ఆమె మాట్లాడుతూ ..”సరైన సమయం వచ్చినప్పుడు నా నిబంధనల ప్రకారమే నేను వివాహం చేసుకుంటాను. అయితే ప్రస్తుతానికి ఎలాంటి తొందర లేదు” అంటూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి అయితే కృతి తన పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే కృతి సనన్ తన సోదరి నుపూర్ సనన్ వివాహాన్ని దగ్గరుండి మరీ జరిపించిన విషయం తెలిసిందే.

కృతి సనన్ సినీ ప్రస్థానం

కృతి సనన్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది ధనుష్ తో కలిసి ‘తేరే ఇష్క్ మే’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు షాహిద్ కపూర్ , రష్మిక తో కలిసి కాక్ టెయిల్ 2 అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా జూన్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే వరుణ్ ధావన్ తో కలిసి ఒక సినిమాలో నటించనున్నట్లు సమాచారం.

కృతి సనన్ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు ఒక ముగింపు పలికారు. సరైన సమయం వచ్చినప్పుడు తన నిబంధనల ప్రకారమే పెళ్లి చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. ఆమె నిర్ణయం కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.