|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్రిష్ 4: మెగా ట్విస్ట్! డైరెక్టర్ గా హృతిక్ రోషన్.. యష్ రాజ్ ఫిలిమ్స్ షాకింగ్ డెసిషన్!

Published: 09-02-2026, 12:05 AM
క్రిష్ 4: మెగా ట్విస్ట్! డైరెక్టర్ గా హృతిక్ రోషన్.. యష్ రాజ్ ఫిలిమ్స్ షాకింగ్ డెసిషన్!
  • క్రిష్ 4: డైరెక్షన్ బాధ్యతలు చేపట్టనున్న హృతిక్ రోషన్, తండ్రి రాకేష్ రోషన్ స్థానంలో!
  • హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ కోసం రూ.500 కోట్ల బడ్జెట్ అడిగిన హృతిక్ రోషన్!
  • యష్ రాజ్ ఫిలిమ్స్ షాక్: రూ.350 కోట్లలో సినిమా పూర్తి చేయాలని హుకూం!
  • బడ్జెట్ పై వివాదం: హృతిక్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, పరిశ్రమ వర్గాలు!

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ మరోసారి క్రిష్ గా అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హృతిక్ రోషన్ స్వయంగా డైరెక్షన్ బాధ్యతలు చేపట్టనుండటం విశేషం.

హృతిక్ చేతికి డైరెక్షన్ బాధ్యతలు!

Krrish 4: బాలీవుడ్ గ్రీకు వీరుడిగా పేరుతెచ్చుకున్నాడు హృతిక్ రోషన్. ఆయన సినిమాలాక్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఆయన సూపర్ హీరోగా చేసిన క్రిష్(Krrish 4) సిరీస్ కి సూపర్ డిమాండ్ ఉంది. ఆ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో సీక్వెల్ గా క్రిష్ 4 వస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే, గత మూడు సినిమాలను హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించగా క్రిష్ 4కి మాత్రం స్వయంగా హృతిక్ రోషనే మెగా ఫోన్ పట్టుకోనున్నాడట. అంతేకాదు, ఈ సినిమాకు కథను కూడా ఆయనే అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే, క్రిష్ సిరీస్ కి ఆడియన్స్ లో ఫుల్ డిమాండ్ ఉండగా ఈసారి యష్ రాజ్ సంస్థ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.

500 కోట్ల బడ్జెట్ అడిగిన హీరో!

అయితే, క్రిష్ 4 సినిమాను హృతిక్ రోషన్ భారీ గ్రాఫిక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తీయాలని చూస్తున్నాడట. అందుకోసం తనకు రూ.500 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని యష్ రాజ్ ఫిలిమ్స్ ని కోరాడట హృతిక్ రోషన్. అయితే, ఆ సూచనను యష్ రాజ్ సంస్థ అంగీకరించలేదు అని తెలుస్తోంది. కేవలం రూ.350 కోట్లలో సినిమాను ఫినిష్ చేయాలనీ కోరారట. లేదంటే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాం అని కూడా వార్నింగ్ ఇచ్చారట.

యష్ రాజ్ ఫిలిమ్స్ బిగ్ షాక్!

అసలు ఊహించని పరిణామంతో హృతిక్ రోషన్ అయోమయంలో పడిపోయాడట. కేవలం రూ.350 కోట్లతో అంత పెద్ద సినిమాను చేయడం చాలా కష్టం అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సిచువేషన్ లో హృతిక్ రోషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడివరకు వస్తుంది అని.

క్రిష్ 4 సినిమాకు సంబంధించిన ఈ బడ్జెట్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హృతిక్ రోషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.