
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం మానవ జీవితాలపై ప్రభావం చూపుతుంది. జూలై 23న కుజుడు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది.
Key Points
కుజుని ఉత్తర ఫాల్గుణి నక్షత్ర సంచారం సింహ, తులా, వృశ్చిక రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది.
భూమి, ఆస్తుల కొనుగోలు, ఆర్థిక లాభాలు, కుటుంబ సామరస్యం పెరుగుతాయి.
పెండింగ్ పనులు పూర్తవుతాయి, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి, కొత్త అవకాశాలు లభిస్తాయి.
విజయాలు, డబ్బు సంపాదన, గౌరవం పెరుగుతాయి, మతపరమైన కార్యక్రమాల ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి వారికి శుభ ఫలితాలు
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విధంగా నక్షత్రాలను కూడా ఆ మార్పు చేస్తూ ఉంటాయి. కుజుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ధృక్ పంచాంగం ప్రకారం సూర్యుడు నక్షత్ర మండలమైన ఉత్తర ఫాల్గుణిలోకి కుజుడు జూలై 23న ప్రవేశించబోతున్నాడు. ఆ రోజు ఉదయం 8:50 గంటలకు నక్షత్రం మార్పు చెందుతుంది. ఆగస్టు 13 వరకు ఇదే నక్షత్రంలో సంచారం చేస్తాడు.
దీంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిదని, కొన్ని రాశుల వారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. మరి ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కుజుని నక్షత్ర సంచారంతో ఈ రాశులకు బోలెడు లాభాలు
తులా, వృశ్చిక రాశులకు అనుకూలత
కుజుడు నక్షత్రం మార్పు సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. భూములు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.
తులా రాశి వారికి కూడా కుజుడు నక్షత్రం మార్పు కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జీవితం మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
కుజుడు నక్షత్ర సంచార ప్రభావం
వృశ్చిక రాశి వారికి కూడా కుజుడు నక్షత్రం మార్పు కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. విజయాలను అందుకుంటారు. డబ్బు బాగా సంపాదిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలు చేపడతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
కుజుని నక్షత్ర సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఇది సూచన మాత్రమే. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


