
టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. రాజ్ తరుణ్ మరియు హెబ్బా పటేల్ నటించిన ‘కుమారి 21F’ సినిమా జూలై 10న రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది.
Key Points
కుమారి 21F రీ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది.
జూలై 10న థియేటర్లలో మళ్ళీ విడుదల కానుంది.
రాజ్ తరుణ్ మరియు హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా 2015లో విడుదలైంది.
ట్రైలర్‌కు నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
కుమారి 21F రీ రిలీజ్ ట్రైలర్ విడుదల
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల కన్న పాత చిత్రాల రీ రిలీజ్‌లకే అభిమానులు భారీగా క్యూలు కడుతున్నారు. అలా ఇప్పటికే చాలా చిత్రాలు రీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక లవ్ స్టోరీ రీ రిలీజ్‌కు కాబోతుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun), బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) జంటగా నటించిన కుమారి 21ఎఫ్(Kumari 21F) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. పల్నాటి సూర్య ప్రతాప్(pALNATI sURYA pRATHAP) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లేతో పాటు సహ నిర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే.
2015లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. అయితే ఈ మూవీ జూలై 10న రీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రీరిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ టీమ్. ఇక ట్రైలర్ ‘కలలుగా మారే ప్రతి జీవితం వెనుక ఒక క్రైమ్ ఉంటుంది’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అన్నీ కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని హైలెట్ అని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ కింద నెటిజన్లు మళ్లీ థియేటర్లలో హిట్టు పక్కా బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్‌ను చూసేయండి.
జూలై 10న థియేటర్లలో సందడి
నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్
కుమారి 21F రీ రిలీజ్‌కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో విడుదలైన ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


