|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kurukshetra Ott: ఓటీటీ సిరీస్‌గా మహాభారతంలోని కీలక ఘట్టం

Published: 10-09-2025, 3:48 AM
Kurukshetra Ott: ఓటీటీ సిరీస్‌గా మహాభారతంలోని కీలక ఘట్టం

తాజాగా, మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని యానిమేషన్ రూపంలో ఓటీటీ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఓటీటీ సిరీస్‌గా తెరకెక్కుతోంది.

2

నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 10 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం.

4

పురాణాలపై పెరుగుతున్న ఆసక్తిని ఈ సిరీస్ ప్రతిబింబిస్తుంది.

కురుక్షేత్రం: యానిమేషన్ ఓటీటీ సిరీస్

ఇప్పటి జనరేషన్‌కి పురాణాలు, ఇతిహాసాల గురించి కాస్త తక్కువగానే తెలుసు. అలానే రీసెంట్ టైంలో ఈ జానర్‌లో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. నెలన్నర క్రితం థియేటర్లలో రిలీజైన ‘మహావతార్ నరసింహ’ అనే యానిమేటెడ్ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని దారిలోనే తెలుగులోనూ ‘వాయుపుత్ర’ అనే సినిమా రాబోతుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసినట్లు కనిపిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల తేదీ

సిరీస్ క్రియేటర్ మరియు దర్శకుడు

మహాభారతంలోని కురుక్షేత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ ఘట్టాన్ని యానిమేషన్ రూపంలో ఓటీటీ సిరీస్‌గా తీసుకొచ్చేందుకు సిద్ధమైపోయారు. తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. అక్టోబరు 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వీడియో ఇప్పుడు రిలీజ్ చేశారు. అను సిక్కా ఈ సిరీస్ క్రియేటర్ కాగా.. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించారు. మరి ఈ ‘కురుక్షేత్ర’ సిరీస్.. ప్రేక్షకుల్ని ఎంతలా అలరిస్తుందో చూడాలి?

మహాభారతంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తీసుకువచ్చిన ఈ యానిమేటెడ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.