|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Dadasaheb Phalke Film Festival Award : దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌..

Published: 04-05-2025, 1:21 AM
Dadasaheb Phalke Film Festival Award : దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌..

తాజాగా జరిగిన 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిభావంతుడైన సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ఉత్తమ సినిమాటోగ్రఫర్ అవార్డును అందుకున్నారు. రజాకార్ సినిమా ద్వారా ఆయన సినీ ప్రేక్షకులను మెప్పించారు.

Key Points

1

దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కుశేందర్ రమేష్ రెడ్డి ఉత్తమ సినిమాటోగ్రఫర్ అవార్డును అందుకున్నారు.

2

రజాకార్ సినిమాలోని అద్భుతమైన విజువల్స్‌కు ఆయనకు ఈ అవార్డు లభించింది.

4

ప్రస్తుతం ఆయన బార్బరిక్, అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ సినిమాలకు పనిచేస్తున్నారు.

కుశేందర్ రమేష్ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు

Dadasaheb Phalke Film Festival Award : తాజాగా జరిగిన 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి అవార్డు అందుకున్నారు. రజాకార్ సినిమాలోని తన విజువల్స్‌తో అందరినీ మెప్పించాడు ఈ సినిమాటోగ్రఫర్. రజాకార్ సినిమాకు తన కెమెరా వర్క్ కి గాను ఈ అవార్డు అందుకున్నారు.

కుశేందర్ రమేష్ రెడ్డి కేకే సెంథిల్ కుమార్ దగ్గర ఈగ, బాహుబలి 1,బాహుబలి 2, RRR సినిమాలకు చీఫ్ అసోసియేట్‌ గా పని చేస్తూ ఇప్పుడు కెమెరామెన్ గా మారి రజాకార్ సినిమాకు గాను దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ కెమెరామెన్‌గా నిలిచారు.

రజాకార్ సినిమా విజయం

నిజాం రాజుల నిరంకుశ పాలనను, రజాకర్ల దౌర్జన్యాల్ని మట్టు పెట్టి నిజాం రాజ్యాన్ని భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా కలిపారు అనే వీర గాథల్ని యాట సత్యనారాయణ దర్శకత్వంలో రజాకార్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇదే సినిమాకు డైరెక్టర్ కూడా అవార్డు అందుకున్నారు.

భవిష్యత్ ప్రాజెక్టులు

ఇక సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి ప్రస్తుతం బార్బరిక్, అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

కుశేందర్ రమేష్ రెడ్డి వృత్తి జీవితంలో ఇది ఒక ముఖ్యమైన మలుపు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.