
📌 Key Points
- కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి.
- జననాయగన్ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.
- యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా కూడా వాయిదా పడింది.
- సినిమాలు వాయిదా పడటంతో నిర్మాణ సంస్థకు భారీ నష్టాలు వాటిల్లాయి.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. జననాయగన్, టాక్సిక్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు వాయిదా పడటంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. దీని ప్రభావం ఇతర సినిమాలపై పడే అవకాశం ఉంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ సంక్షోభంలో పడటానికి కారణం?
KVN production: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కేవీఎం ప్రొడక్షన్స్ (KVN Production)ప్రస్తుతం సంక్షోభంలో ఉందని చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇటీవల వరుస సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన జననాయగన్ (Jananayagan) సినిమా విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ సినిమాని జనవరి 9వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్రం నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు. సెన్సార్ ఇష్యూ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది ఇప్పటికీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఇలా ఈ సినిమా వాయిదా పడటంతో చిత్ర నిర్మాతలకు భారి స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాతలు యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాని మార్చి 18వ తేదీ ఉగాది పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు అందుకు అనుగుణంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతల సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా విడుదలకు కేవలం 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సినిమాని 19వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాము కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.
వరుసగా వాయిదా పడుతున్న సినిమాలు
ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని భావించిన చిత్ర నిర్మాతలు ఈ సినిమాని వాయిదా వేస్తూ జూన్ 4వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు .ఈ నేపథ్యంలోనే అభిమానులు కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదల వాయిదా పడటంతో నిర్మాణ సంస్థకు భారీగా నష్టాలు కూడా వచ్చాయని చెప్పాలి. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు వరుసగా వాయిదా పడటంతో నిర్మాతలకు కూడా అధిక వడ్డీ భారం అవుతుందని చెప్పాలి.
చిరంజీవి సినిమా పై ప్రభావం పడనుందా?
చిరంజీవి సినిమాపై దీని ప్రభావం ఉంటుందా?
ఇలా కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి విడుదల కావాల్సిన ఈ రెండు సినిమాలు వాయిదా పడటంతో ఈ ప్రొడక్షన్ నుంచి షూటింగ్ జరుపుకునే సినిమాలపై కూడా కాస్త ప్రభావం చూపుతుందనే చెప్పాలి. కేబీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి బాబి డైరెక్షన్లో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే నిజానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ప్రారంభించాల్సి ఉండగా ఇప్పటికీ పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోలేదు. ఇప్పుడు టాక్సిక్ కూడా వాయిదా పడటంతో చిరంజీవి సినిమా మరింత ఆలస్యం అవుతుందా? అనే సందేహాలను కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సుమారు 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు విడుదల కాకుండా ఆగిపోవడం అంటే చిత్ర నిర్మాతలకు భారీ నష్టాలనే చెప్పాలి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వరుసగా సినిమాలు వాయిదా పడటం, ఆర్థిక నష్టాలు వాటిల్లడంతో సంస్థ ఈ కష్టాల నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.


