|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2: అఖండ 2 పై దువ్వాడ శ్రీనివాస్ , మాధురి రివ్యూ.. జై బాలయ్య అంటూ!

Published: 12-12-2025, 2:08 AM
Akhanda 2: అఖండ 2 పై దువ్వాడ శ్రీనివాస్ , మాధురి రివ్యూ.. జై బాలయ్య అంటూ!
  • అఖండ 2 సినిమాపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి అభిప్రాయాలు తెలిపారు.
  • రాజకీయాలకు అతీతంగా బాలకృష్ణ సినిమా అంటే ఇష్టమని స్పష్టం చేశారు.
  • లైవ్ లోనే ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేసి సంచలనం సృష్టించారు.
  • తమ పుట్టినరోజు పార్టీ అరెస్ట్ వార్తలను ఖండించి వివరణ ఇచ్చారు.

బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాపై ప్రముఖ రాజకీయవేత్త దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా బాలకృష్ణ సినిమాలను ఇష్టపడతానని చెబుతూ, ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. తమ పుట్టినరోజు పార్టీ వివాదంపై కూడా వారు వివరణ ఇచ్చారు.

అఖండ 2 పై దువ్వాడ, మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు

Akhanda 2: బాలకృష్ణ (Balakrishna)హీరోగా నటించిన అఖండ 2 (Akhanda 2) సినిమా ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమా పట్ల వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ రాజకీయవేత్త దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas), దివ్వల మాధురి(Divvela Madhuri) మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

డిసెంబర్ 12వ తేదీ దివ్వెల మాధురి పుట్టినరోజు కావడంతో శ్రీనివాస పార్టీ అరేంజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారని , పోలీసులు ఈ పార్టీపై దాడి చేసి అడ్డుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మాధురి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. మాధురి పుట్టినరోజు డిసెంబర్ 12వ తేదీ అయితే మేము 12వ తేదీ రాత్రి సెలబ్రేట్ చేసుకుంటాము కానీ నిన్న రాత్రి మాకు తెలిసిన వ్యక్తి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నామని తాము అరెస్టయ్యాము అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇక నేడు సాయంత్రం పార్టీ ఏర్పాటు చేసి అనంతరం తాము అఖండ2 సినిమాకు వెళ్తామని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా బాలకృష్ణ అభిమానం

ఇలా అఖండ 2 సినిమాకు వెళ్తామని చెప్పడంతో రాజకీయాల పరంగా బాలకృష్ణ దువ్వాడ శ్రీనివాస్ కు ప్రత్యర్థి అయినప్పటికీ సినిమాలు చూస్తారా? అనే ప్రశ్న ఎదురయింది. తాను సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని ఇప్పటికి కూడా ప్రతిరోజు సీనియర్ ఎన్టీఆర్ గారి పాటలు వింటానని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొడుకుగా బాలయ్య బాబు అంటే కూడా తనకు ఇష్టమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా, సినిమాలపరంగా నాకు ఆయన అంటే ఇష్టం కచ్చితంగా బాలకృష్ణ ప్రతి ఒక్క సినిమా చూస్తామని తెలిపారు. ఇలా బాలకృష్ణ గురించి మాట్లాడటమే కాకుండా లైవ్ లోనే జై బాలయ్య అంటూ మాధురి శ్రీనివాస్ చెప్పడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

ఇక బాలకృష్ణను వ్యక్తిగతంగా ఎప్పుడైనా కలిసారా అంటూ ప్రశ్న ఎదురవడంతో అసెంబ్లీలో చూశాను తప్ప వ్యక్తిగతంగా ఇప్పటివరకు తనని కలవలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక మాధురి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరెస్ట్ అయ్యారని వచ్చిన వార్తలను మాధురి ఖండించారు. ఇక మాధురి ఇటీవల మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇలా రెండు వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఈమె బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ ను పేద ప్రజలకు సహాయంగా వినియోగించిన సంగతి తెలిసిందే.

పుట్టినరోజు పార్టీ వివాదంపై వివరణ

మొత్తంగా, అఖండ 2 సినిమాతో పాటు దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి వ్యాఖ్యలు, బాలకృష్ణ పట్ల వారి అభిమానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ భేదాలు పక్కన పెట్టి సినీ అభిమానాన్ని చాటుకోవడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.