|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లావణ్య: ఫుల్లుగా తాగి కారు నడిపి అడ్డంగా దొరికిపోయిన రాజ్ తరుణ్ మాజీ లవ్లీ! సీజ్ చేసిన పోలీసులు!

Published: 25-03-2026, 2:05 PM
లావణ్య: ఫుల్లుగా తాగి కారు నడిపి అడ్డంగా దొరికిపోయిన రాజ్ తరుణ్ మాజీ లవ్లీ! సీజ్ చేసిన పోలీసులు!
  • రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో కారు నడుపుతూ బైక్‌ను ఢీకొట్టింది.
  • లావణ్య డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడటంతో ఆమె కారును సీజ్ చేశారు.
  • మద్యం మత్తులో లావణ్య గ్రామస్తులు, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
  • లావణ్య కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మద్యం మత్తులో లావణ్య కారు ప్రమాదం

Lavanya: రాజ్ తరుణ్ (Raj Tarun) మాజీ ప్రియురాలు లావణ్య (Lavanya) అందరికీ గుర్తుండే ఉంటుంది. మరిచిపోవడానికి ఆమె ఏమైనా సామాన్యమైన రచ్చ చేసిందా? లాస్ట్ ఇయర్ టాలీవుడ్ టాప్ కాంట్రవర్సీలలో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం కూడా ఉందంటే.. వారి మధ్య ఏ రేంజ్‌లో గొడవలు నడిచాయో అర్థం చేసుకోవచ్చు. వారిద్దరూ సుమారు 11 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారని, రహస్యంగా గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య అప్పట్లో పోలీసులకు తెలిపారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో కొనుగోలు చేసిన ఇంటి విషయంలో కూడా వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు లావణ్య మరోసారి అడ్డంగా బుక్కయింది. అవును, తాజాగా ఆమె చేసిన పనితో.. రాజ్ తరుణ్‌‌పై సింపతీ కూడా బాగా పెరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే..

మల్లెపల్లి వద్ద లావణ్య మద్యం మత్తులో కారు నడుపుతూ ఒక బైక్‌ను ఢీకొట్టడంతో, పోలీసులు ఆమెపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, కారును సీజ్ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలీసులతో మరియు స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం మత్తులో కారు నడుపుతూ.. మల్కాపూర్ (మం) మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టి, ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన లావణ్యను.. అక్కడి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఆమె గ్రామస్తులతో గొడవకు దిగడంతో.. అక్కడ పెద్ద వాగ్వివాదం జరిగింది. లావణ్యను సారీ చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో.. ఆమె వారితో గొడవకు దిగింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులపై కూడా ఆమె గొడవకు దిగినట్లుగా తెలుస్తోంది.

పోలీసులకు చిక్కిన లావణ్య.. కేసు నమోదు

వెంటనే ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి, అందులో పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, కారును కూడా సీజ్ చేసి, కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆమె కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లుగా గ్రామస్తులు పోలీసులకు తెలపడంతో, కారుని సీజ్ చేసి, ఆమెపై మోటార్ వెహికల్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లావణ్య పేరు మరోసారి వార్తలలో మారు మోగుతోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ విషయంలో మోసపోయిందని కొంత మందికి ఆమెపై జాలి ఉంది. కానీ, ఈ వ్యవహారంతో అది కూడా పోయినట్టే. చూద్దాం మరి.. ఈ విషయం ఎంత వరకు వెళుతుందో..!

మద్యం మత్తులో హల్‌చల్ చేసిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి వద్ద బైకును కారుతో ఢీ కొట్టిన లావణ్య

ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కారును అడ్డుకున్న గ్రామస్తులు

గ్రామస్తులతో వాగ్వాదం.. అసలేం జరిగింది?

గ్రామస్తులతో వాగ్వాదానికి దిగిన లావణ్య..పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు

డ్రంక్… pic.twitter.com/IzdggQ1dEl

— BIG TV Breaking News (@bigtvtelugu) March 25, 2026

మొత్తానికి లావణ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకోవడం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.